ఫిలిం న్యూస్
 
 
 
 
సత్యదీప్‌ ‘ఐ హేట్ యూ’

జయంత్‌ని హీరోగా పరిచయం చేస్తూ... సత్య దర్శకత్వంలో, పందెం సత్యదీప్‌రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘ఐ హేట్ యూ’. ఈ చిత్రం గురువారం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి రాష్ట్రమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కెమెరా స్విచాన్ చేయగా, నటుడు సాయిరామ్‌శంకర్ క్లాప్ ఇచ్చారు. సంతోష్ శ్రీనివాస్ గౌరవ దర్శకత్వం వహించారు.

నిర్మాత మాట్లాడుతూ -‘‘నిర్మాతగా ఇది నా రెండవ సినిమా. ఒక సిట్టింగ్‌లో ఈ కథను ఓకే చేశాం. కథకు తగ్గ హీరో కోసం చూస్తున్న సమయంలో జయంత్‌కు సంబంధించిన డెమో చూశాం. ఇతనే కరెక్ట్ అనిపించి వెంటనే ఓకే చేశాం. వచ్చే నెల 15 నుంచి చిత్రీకరణ మొదలవుతుంది’’ అని తెలిపారు. ‘‘పూరీజగన్నాథ్ దగ్గర కొన్నాళ్లపాటు దర్శకత్వ శాఖలో పనిచేశాను. దర్శకుడిగా ఇది నా తొలి సినిమా.

ఒకరినొకరు హేట్ చేసుకొనే ఓ అమ్మాయి, ఓ అబ్బాయి...లవ్ చేసుకునే స్థితికి ఎలా వచ్చారు. వారి ప్రేమను ఎలా గెలిపించుకోగలిగారు అనేది ఈ చిత్ర కథ’’ అని దర్శకుడు చెప్పారు. లండన్‌లో యాక్టింగ్ కోర్స్ చేశానని, ఇది రొమాంటిక్ కామెడీ థ్రిలర్ అని, తొలిసారి కెమెరా ముందు నిలబడటం థ్రిల్లింగ్‌గా ఉందని హీరో జయంత్ చెప్పారు.