‘స్నేహగీతం’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన ‘మధుర’ శ్రీధర్ మలి ప్రయత్నంగా రూపొందిస్తున్న ‘ఇట్స్ మై లవ్ స్టోరీ’ చిత్రం కోసం టాలెంట్ హంట్ ప్రారంభించారు. ఈ చిత్రాన్ని కూడా శ్రీధర్ అంతా కొత్తవాళ్లతో రూపొందిస్తున్నారు. మల్టీ డైమన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రయివేట్ లిమిటెడ్ సమర్పణలో షిర్డిసాయి కంబైన్స్ పతాకంపై డామున్నా వెంకట కృష్ణారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం నిర్వహించబడుతున్న ప్రతిభాన్షేణ కార్యక్రమానికి హైద్రాబాద్‌లోని హోటల్ తాజ్ క్రిష్ణాలో శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ‘స్టార్‌హంట్’లో భాగస్వామ్యం వహిస్తున్న ‘కళామందిర్’ అధినేత కళ్యాణ్, జెమిని టీవీ సీఈవో సంజయ్‌రెడ్డి, సెల్‌కాన్ సీఈవో మురళి, బిగ్‌బజాన్ సౌతిండియన్ హెడ్ శిలాష్‌పాల్, రేడియో మిర్చి ప్రతినిధి హేమంత్‌లతోపాటు, దర్శకుడు మధుర శ్రీధర్, సంగీత దర్శకులు సునీల్ కశ్యప్, గీత రచయిత సిరాశ్రీ, ఎడిటర్ ప్రవీణ్‌బోయిన, ఛీఫ్ అసోసియేట్ డైరెక్టర్ లోకేష్‌నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్ రవికుమార్ పనస, సినీస్టార్ శ్రీనివాస్ తదితరులు పాలుపంచుకున్నారు.
స్టార్‌హంట్‌లో పాల్గొనదలచినవారు starhunt@itsmylovestory.in కు తమ వివరాలు పంపించుకోవచ్చు. ఏవిధమైన బ్యాక్‌గ్రౌండ్ లేకుండానే సినిమా రంగంలో ఉన్నత శిఖరాలలకు చేరుకున్నవాళ్లు అనేకమంది ఉన్నారని, వారి స్ఫూర్తితో తమ స్టార్‌హంట్‌లో పాల్గొని, ‘ఇట్స్ మై లవ్‌స్టోరీ’ చిత్రంలో నటించే అవకాశం సొంతం చేసుకోవచ్చని శ్రీధర్ అన్నారు. మిగతా వక్తలంతా శ్రీధర్ చేస్తున్న ఈ ద్వితీయ ప్రయత్నం కూడా విజయవంతం కావాలని ఆకాంక్షించారు!
|