‘స్నేహగీతం’తో విమర్శకుల ప్రశంసలు పొందిన ‘మధుర’శ్రీధర్‌రెడ్డి తన ద్వితీయ యత్నంగా
రూపొందిస్తున్న చిత్రం ‘ఇట్స్ మై లవ్‌స్టోరీ’. ఎం.వి.కె.రెడ్డి ఈ చిత్రానికి నిర్మాత. ప్రసుతం ఈ సినిమా నిర్మాణ దశలో
ఉంది.
ఈ సినిమా వివరాలను దర్శకుడు శ్రీధర్‌రెడ్డి తెలుపుతూ -‘‘ఇదొక వినూత్న ప్రేమకథ. యువత
మనోభావాలను అద్దంపట్టే విధంగా సినిమా ఉంటుంది. అరవింద్‌కృష్ణ, నిఖిత ఇందులో హీరోహీరోయిన్లు. తొలి
షెడ్యూల్ పూర్తయింది. హీరోహీరోయిన్లతో పాటు నూతన నటీనటులు నటించిన కీలక సన్నివేశాలను ఈ
షెడ్యూల్‌లో చిత్రీకరించాం. ఈ నెల 27 నుంచి జూలై 10 వరకు వైజాగ్‌లో రెండో షెడ్యూల్ జరుగుతుంది. జూలై 18
నుంచి షూటింగ్ పూర్తయ్యేవరకు హైదరాబాద్ పరిసరప్రాంతాల్లో మూడో షెడ్యూల్ ఉంటుంది’’ అని తెలిపారు.
జయసుధ, శరత్‌బాబు, ‘వెన్నెల’ కిషోర్, ‘వెన్నెల’ రామారావు, కల్పిక, రాగారెడ్డి, తాగుబోతు రమేష్, తోట శివ,
దినేష్, హరీష్, రాకేష్, సారిక, సంధ్యాభవాని, రాజేష్, వెంకట్, సచీంద్ర తదితరులు ఇతర పాత్రలు చేస్తున్న ఈ
చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, కో-డెరైక్టర్: రెడ్డి తరణీరావు, కెమెరా: పి.జి.వింద, సంగీతం: సునీల్ కశ్యప్,
సమర్పణ: మల్టి డైమన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లిమిటెడ్.