ఫిలిం న్యూస్
 
 
 
 
శ్రీ జగద్గురు ఆది శంకర
జె.కె.భారవి దర్శకత్వంలో గ్లోబల్ పీస్ క్రియేషన్స్ పతాకంపై రూపొందించిన ‘శ్రీజగద్గురు ఆదిశంకర’ సినిమా వివరాలను వెల్లరించడానికి ఫిలిం ఛాంబర్ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో జె.కె.భారవి, ప్రసన్న కుమార్, నారాజయశ్రీ, నాగ్ శ్రీవత్స, కొండా కృష్ణంరాజు లు పాల్గొన్నారు.

శ్రీజగద్గురు ఆదిశంకర అనే సినిమా టైటిల్ కు వున్న విలువ ఏమిటోగాని పెద్ద పెద్ద నటీనటుల వద్దకు వెళ్ళి చెప్పగానే పాత్ర ఎలాంటి అనేది అడగకుండా ఇప్పటి వరకు ఐదు మంది హీరోలు చేస్తామని ఒప్పుకున్నారు. ఈ కథ గురించి ముఖ్యంగా యువతరానికి తెలియ వలసి ఉంది కాబట్టి వారి కోసమే ఈ సినిమా చేస్తున్నాను. ఆయన ముప్పయి రెండు సంవత్సరాలకే ఎన్నో రాశారు. కాశ్మీర్ నుండి కన్యా కుమారి వరకు పాదయాత్ర చేశాడు. యువతరం తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. శంకరాచార్య గురించి యువతరం తెలుసుకుంటే ఏదైనా చేస్తారు. ఈ సినిమాలో వ్యాపారాత్మక విలువలు ఉంటాయి. ఈ సినిమాలో 16 పాటలు ఉన్నాయి. ఒక్కో పాటకు ఒక్కోరకమైన అనుభూతిని పొందాము. ఇండియాలో టాపర్స్ అయిన గాయనీ గాయకులు ఈ సినిమాలోని పాటలు పాడారు. ఒక పాట బాలసుబ్రహ్మణ్యం గారితో పాడించాలనే ప్రయత్నాల్లో ఉన్నాము. చాలా మంది స్వామీజీలు పండితులు ఈ పాటలు విన్నారు. వారు ఆశీర్వదించారు. పాటలు పాడిన గాయనీ గాయకులు డబ్బులు కూడా తీసుకోలేదు. సినిమా ఉగాది రోజు ప్రారంభమౌతుంది. అప్పుడు మిగిలిన వివరాలు వెల్లడించనున్నాము అన్నారు.

నారా జయశ్రీదేవి మాట్లాడుతూ - అన్నమయ్య, రామదాసు, మంజునాథ స్క్రీన్ ప్లేల కంటే బాగుంటేనే ఈ సినిమా చేయమని అన్నాను. కథ అద్భుతంగా వచ్చింది. పాటలు విన్నాను. అద్భుతంగా ఉన్నాయి.

కొండా కృష్ణంరాజు మాట్లాడుతూ - ఆ మూడు సినిమాలకు ఈ సినిమా సమానం. అవన్నీ పురాణాలకు సంబంధించిన కథలు, తెలుసున్న కథను కొత్తగా మలచి తీయడం అనేది కత్తిమీద సాములాంటిది. అలాంటి చిత్ర కథను తీసుకుని ప్రస్తుత జనరేషన్ కు నచ్చే విధంగా కథ రాసి దర్శకత్వం వహించడం ఆనందించతగ్గ విషయం. ఈయన రాసిన సినిమాలను రాబోవు తరం వారు మరచిపోలేరు. జయశ్రీదేవి గారు కన్నడలో 23 సినిమాలు చేశారు. అక్కడి హీరోలందరూ ఆమె బేనర్ లో చేశారు. ఈ సినిమాలోని పాటలు అద్భుతంగా ఉన్నాయి అన్నారు.

నాగ్ శ్రీవత్స మాట్లాడుతూ - ఈ సినిమాకు సంగీతం చేయడం నా పూర్వజన్మ సుకృతం. ప్రస్తుత జనరేషన్ కు ఇలాంటి సినిమాలు అవసరం. భారవి గారు అలాంటి సినిమాలు రాశారు. ఆ సినిమాలకు కీరవాణి గారు ఒక స్థాయి ఏర్పాటు చేశారు. దానికి తగ్గ విధంగా ఈ పాటలు వచ్చేలా ప్రయత్నించాను.ఇందులో చాలా స్త్రోత్రాలు ఉన్నాయి. ఈ సినిమాకు పని వారందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను అన్నారు.