ఫిలిం న్యూస్
 
 
 
 
ప్రేమ కధ 'జహాపనా'

శ్రీ కృతి సమర్పణలో లలితాశ్రీ కాంబైన్స్ యూనిట్ సారధ్యంలో తెరకెక్కబోతున్న చిత్రం ‘జహాపనా’. శశి ప్రీతమ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రానికి ఆర్.వి.రమణ మూర్తి కథను అందించారు. ఈ చిత్ర విశేషాలు చర్చించడానికి పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

రమణ మూర్తి మాట్లాడుతూ - గతంలో నేను చాలా డాక్యుమెంటరీలు, సినిమాలు చేశాను. అన్ని మ్యూజికల్ హిట్స్ ని ఇచ్చాయి. ఈ ‘జహాపనా’ సినిమా కోసం రెండు సంవత్సరాలుగా కష్టపడుతున్నాను. సంగీత దర్శకుడు, ఉత్సాహవంతుడైన శశి ప్రీతమ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. తండ్రి కొడుకుకి, కొడుకుకి ప్రేయసికి, ప్రేయసికి మహా రాజుకి మధ్య గల బంధాన్ని గురించి తెలిపే కథ ఇది. అద్భుతమైన కథతో ఈ చిత్రాన్ని నాగరికతను తెలిపే విధంగా చిత్రించానున్నామని అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను అన్నారు.

శశి ప్రీతమ్ మాట్లాడుతూ - 90 స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యింది. పాటలు పూర్తి చేశాము. చరిత్రలో జరిగిన నిజాలు చెప్పడానికి రమణ మూర్తిగారు పడే తాపత్రయం నాకు బాగా నచ్చింది అన్నారు.

కేదరినాథ్ మాట్లాడుతూ - నగర నిర్మాణానికి, నాగరికతకు బీజం వేసిన ప్రేమ కథను ఈ సినిమాలో చూపించబోతున్నాము. నాకు ఈ సినిమాలో పాటలు, మాటలు రాసే అవకాశం ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది.