ఎన్.టి.ఆర్.ఆర్ట్స్ సంస్థ కల్యాణ్‌రామ్ కథానాయకుడిగా చిత్రాన్ని నిర్మిస్తోంది. హన్సిక కథానాయిక. నరేన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాకి 'జయీభవ' అనే పేరుని ఖరారు చేశారు. చిత్రీకరణ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెల చివరి వారంలో పాటల్ని విడుదల చేయబోతున్నారు. కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ ''కథకు తగ్గ పేరు 'జయీభవ'. బాధ్యతలు తెలిసిన ఓ యువకుడి జీవితం చుట్టూ అల్లుకొన్న చిత్రమిది. లక్ష్యం దిశగా అడుగులు వేస్తాడు. గతంలో మేం నిర్మించిన 'అతనొక్కడే', 'హరేరామ్' సినిమాల్ని ప్రేక్షకులు ఆదరించారు. ఆ కోవలోకే మా తాజా చిత్రమూ చేరుతుంది. వినోదం, యాక్షన్ అంశాలు సమపాళ్లలో మేళవించామ''న్నారు. ముఖేష్ రుషి, ఆశిష్ విద్యార్థి, జయప్రకాష్‌రెడ్డి, అలీ, బ్రహ్మానందం, చలపతిరావు, సుధ, హేమ తదితరులు నటించారు. మాటలు: బి.వి.ఎస్.రవి, సంగీతం: తమన్.ఎస్., ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్ర, సమర్పణ: నందమూరి శౌర్యారామ్, నిర్మాత: నందమూరి కల్యాణ్‌రామ్.
|