హ్యారీపోటర్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ లాంటి సుప్రసిద్ధ హాలీవుడ్ చిత్రాల్లో ముఖ్య పాత్ర పోషించిన
మైఖేల్ గామన్ ఓ తెలుగు సినిమాలో నటించారు. ఆ సినిమా పేరు ‘కారాలు మిరియాలు’.
కొత్త, పాత తారల కలయికతో రూపొందిన ఈ చిత్రంలో మైఖేల్ గామన్ పాత్ర ఓ ప్రత్యేక ఆకర్షణ.
బ్లూరే ప్రొడక్షన్స్ పతాకంపై పసుపులేటి వెంకట రామారావు స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం గురించి వెంకటరామారావు మాట్లాడుతూ- ‘‘ఈ సినిమా షూటింగ్ మొత్తం లండన్, స్కాట్లాండ్‌లలో జరిగింది. రొమాంటిక్ కామెడీ విత్ ఫాంటసీ థ్రిల్లర్ ఇది. తెలుగు సంస్కృతికి పెద్ద పీట వేసే సినిమా ఇది.
ప్రవీణ్‌కృష్ణమూర్తి, విద్యాధరణిలను సంగీత దర్శకులుగా పరిచయం చేస్తున్నాం. చాలామంచి సంగీతం అందించారు. మార్చిలో ఆడియోను, చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నా హాలు చేస్తున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: మహేష్ రాయల్, ఎడిటర్: మేనగ శ్రీను.