ఫిలిం న్యూస్
 
 
 
 
18 న 'కారాలు -మిరియాలు'
బ్లూరే ప్రొడక్షన్స్ పతాకంపై పసుపులేటి వెంటక రామారావు స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘కారాలు మిరియాలు’ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది. ఈ విషయాన్ని వెల్లడించడానికి ఫిలిం ఛాంబర్ లో పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పటు చేశారు.

పసుపులేటి వెంకట రామారావు మాట్లాడుతూ - ఈ సినిమాని మేము విదేశాల్లో తీశాము. ఓ కొత్త ఆలోచనతో ఈ ప్రేమకథా చిత్రాన్ని రూపొందిస్తున్నాము. లండన్, స్కాట్ ల్యాండ్ లలో ఈ సినిమా షూటింగ్ జరిగింది. లవ్ తో పాటు ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ కూడా ఉంటుంది. ఈ సినిమా ఈ నెల 18న విడుదల చేయనున్నాము అన్నారు.

నవకేష్ మాట్లాడుతూ - సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శకుడికి రుణపడి ఉంటాను. ఈ సినిమా కథ విషయానికి వస్తే రొమాంటిక్, కామెడీ, ఫాంటసీ అంశాలు ఇందులో ఉంటాయి. పెళ్ళయిన తరువాత ప్రేమను ఎలా కాపాడు కోవాలి అనేది చిత్ర దర్శకుడు ఈ సినిమాలో చాలా బాగా చూపించాడు. ఈ సినిమా లండన్ బ్యాక్ డ్రాప్ లో జరిగినా మన సంప్రదాయాలు మన జీవిత విధానం ఇందులో ఉంటుంది. ఈ సినిమాను ప్రేక్షకులు తప్పకుండా ఆశీర్వదిస్తారనే నమ్మకం ఉంది అన్నారు.

రవీంద్ర పెండ్యాల మాట్లాడుతూ - ఈ సినిమాకు పాటలు రాసే అవకాశం కల్పించిన దర్శకుడికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ చిత్ర కథానాయకుడు నవకేస్ ఈ అవకాశం కల్పించారు. ఈ సినిమాకు మంచి సంగీతం కుదిరింది. ఫారిన్ లో ఉగాది పచ్చడి తిండే ఎలా ఉంటుందో ఈ సినిమా చూస్తే అలా ఉంటుంది. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని ఆశిస్తున్నాను అన్నారు.