Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
'బ్రోకర్‌' పాటలో కౌష
      తనలోని నటనను, సంగీతాన్ని, దర్శకత్వాన్ని ఒకే సినిమాలో ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు ఆర్పీ పట్నాయక్‌. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'బ్రోకర్‌'. శ్రీహరి ఓ కీలకపాత్రను పోషిస్తున్న ఈ సినిమాని మద్దినేని రమేష్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఓ పాటను హైదరాబాద్‌లో కౌష, ఆర్పీ, ఇతర డ్యాన్సర్లపై చిత్రీకరిస్తున్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పట్నాయక్‌ మాట్లాడుతూ "బ్రోకర్ల కార్యకలపాలు ఎలా వుంటాయి, వాళ్ళు చేసుకునే పార్టీలు ఎలా వుంటాయి? అనే కాన్సెప్ట్‌తో ఈ పాటను చిత్రీకరిస్తున్నాం. 'గాజువాక పిల్లా' తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో నాకు ఈ పాట పేరు తెచ్చిపెడుతుంది' అన్నారు. జూన్‌లో సినిమాని ప్రారంభించి 40 రోజుల్లో సినిమాని పూర్తిచేశామని, సెప్టెంబర్‌ 2 నుంచి మూడు రోజుల పాటు శ్రీహరిపై చిత్రీకరించే సన్నివేశాలతో షూటింగ్‌ పూర్తవుతుందని నిర్మాత చెప్పాడు. మయూరి నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: వెంకట్‌ వర్ధినేని.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com