Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
కామాక్షి రజతోత్సవ కానుక ‘కేడి’
     కామాక్షి కళామూవీస్ పతాకంపై కిరణ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ డి.శివప్రసాదరెడ్డి నిర్మిస్తున్న చిత్రానికి ‘కేడి’ అని పేరు పెట్టారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ- ‘రమ్మీ’ అని ఈ చిత్రానికి పేరు పెట్టాలనుకున్నాం. అయితే, ఆ పేరు వేరేవాళ్ళు రిజిస్టర్ చేసి ఉండడంతో దానికి వారు 10లక్షలు డిమాండ్ చేశారు. ఇటువంటి వారిపై ఛాంబర్ తగు చర్య తీసుకోవాలి. ఈ చిత్రానికి ‘కేడి’ అని నిర్మాత పేరు పెట్టారు. ‘యువ’ సీరియల్ కి డైలాగ్స్ రాసిన కిరణ్, సన్నివేశాలను చెప్పే విధానం నచ్చి దర్శకుడిగా అవకాశం ఇచ్చాను. అతను ఏంచేసినా నమ్మకంతో చేస్తాడు. పైగా చేతిలో సరస్వతి వుంది. మనుషుల్ని మాయచేస్తూ బతికే వ్యక్తిగా ఇందులో చేస్తున్నాను. నిజంగా ఇది నాకు కొత్త రకం పాత్ర. ఈ చిత్రం ఎంటర్ టైన్మెంట్ యాక్షన్ తో ప్రారంభమై సీరియస్ గా మారుతుంది. ఈ చిత్రం అన్నింట్లోనూ కొత్తదనం కనిపిస్తుంది. దీన్ని కమర్షియల్ ఎక్స్పరిమెంట్ అనవచ్చు. ‘కింగ్’లో నటన చూసి మమతా మోహన్ దాస్ కి ఇందులో అవకాశం ఇచ్చాను. ఈ సంస్థకు ఈ చిత్రం సిల్వర్ జూబ్లీ సంవత్సర చిత్రం కావడం కూడా చాలా ఆనందంగా వుంది’ అని అన్నారు.

నిర్మాత డి.శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ- ‘ఈ చిత్రాన్ని జనవరిలో విడుదల చేస్తాం. 2010కి మూడు ప్రత్యేకతలున్నాయి. శోభన్ బాబుతో ‘శ్రావణసంథ్య’ చిత్రాన్ని 25ఏళ్ళ క్రిందట చేశాం. 1985లో నాగార్జునతో పరిచయం అయ్యింది. మంచి స్నేహితుడు నాగార్జునతో ‘కేడి’ విడుదల చేయడం, చిన్నప్పటి నుండీ చూసిన నాగచైతన్యతో ఓ చిత్రం ఈ సంవత్సరం చేయడం ప్రత్యేకతలు. మాస్ అంటే నాకు ఇష్టం. అందుకే దీనికి ‘కేడి’ అని పేరు పెట్టాను. గ్రీస్ లో ఓ పాట, సెట్లో ఓ పాట క్లైమాక్స్ తో చిత్రం పూర్తవుతుంది. దర్శకుడు కిరణ్ మంచివాడు. ఈ చిత్రం జరుగుతున్న సమయంలో నాకు బాగా నచ్చాడు’అని అన్నారు.

దర్శకుడు కిరణ్ మాట్లాడుతూ- ‘ఈ చిత్రం విషయంలో నాగ్ పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి ఎన్నో సలహాలిచ్చారు. స్క్రీన్ ప్లే కొత్తగా వుంటుంది. ఇందులో డిఫరెంట్ నాగార్జున కనిపిస్తాడు- అని చెప్పారు. ఈ చిత్రానికి సందీప్ చౌతా సంగీతాన్ని అందిస్తున్నారు.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com