సూపర్ స్టార్ మహేష్ హీరోగా స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎస్.సత్యరామమూర్తి సమర్పణలో శింగనమల రమేష్ బాబు, సి.కళ్యాణ్ నిర్మిస్తున్న భారీ చిత్రం రెండు పాటలు మినహా పూర్తయింది. ఆగస్ట్ 9 మహేష్ బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘ఖలేజా’ విశేషాల్ని తెలియజేశారు.
నిర్మాతల్లో ఒకరైన శింగనమల రమేష్ బాబు మాట్లాడుతూ- ‘మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ‘ఖలేజా’ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా రూపొందుతోంది. హై బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మిస్తున్న ‘ఖలేజా’ మహేష్ కెరీర్లోనే గొప్ప సెన్సేషనల్ ఫిలిం అవుతుంది’ అన్నారు.
మరో నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ- ‘రెండు పాటలు మినహా మహేష్ ‘ఖలేజా’ పూర్తయింది. ఈ రెండు పాటల్ని ఈనెల 18నుండి చిత్రీకరిస్తారు. ఈనెలాఖరులోనే ఆడియో రిలీజ్ చేసి సెప్టెంబర్లో సినిమాని విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాం. మహేష్ కెరీర్లో బడ్జెట్ పరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా, క్వాలిటీపరంగా, రెవెన్యూపరంగా అన్నివిధాలా ‘ఖలేజా’ నెంబర్ వన్ చిత్రం అవుతుందన్న నమ్మకం నాకుంది. ‘ఖలేజా’లో మహేష్ అద్భుతంగా చేశారు. మహేష్ తప్ప ఎవరూ ఈ క్యారెక్టర్ చెయ్యలేరు. దర్శకుడిగా త్రివిక్రమ్ పొటెన్షియాలిటీని ‘ఖలేజా’ ఫ్రూవ్ చేస్తుంది. మా పార్టనర్ శింగనమల రమేష్బాబుకి ‘ఖలేజా’ అన్ని విధాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవకుండా నిర్మిస్తున్న ‘ఖలేజా’ అందరి ఎక్స్ పెక్టేషన్స్ ని రీచ్ అయి అద్భుతమైన విజయాన్ని సాధిస్తుంది’ అన్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు, అనూష్క జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, సునీల్, వేణుమాధవ్, అలీ, నాజర్, ఎం.ఎస్.నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తనికెళ్ళ భరణి, షఫీ, సుశీల్ శర్మ, సుధ, శ్రీరంజని తదితరులు మిగతా పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : మణిశర్మ, ఫొటోగ్రఫీ: ఎస్.భట్, ఫైట్స్: రామ్-లక్షణ్, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, ఆర్ట్ : ఆనంద్ సాయి, సమర్పణ : ఎస్.సత్యరామమూర్తి, నిర్మాత: శింగనమల రమేష్ బాబు, సి.కళ్యాణ్, కథ-స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : త్రివిక్రమ్.