వరుణ్ సందేశ్ కథానాయకుడిగా నటించిన చిత్రం 'కుదిరితే కప్పు కాఫీ'. సుమ భట్టాచార్య కథానాయిక. శివ ప్రొడక్షన్స్ ప్రై. లిమిటెడ్, మూన్ వాటర్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రమణ సాల్వ దర్శకుడు. శివ, మహి నిర్మాతలు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 25న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ "చక్కని ప్రేమకథా చిత్రంగా రూపొందించాం.
ఈ నెల 25న 80 స్క్రీన్‌లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. యోగి అందించిన బాణీలకు మంచి స్పందన వచ్చింది. పాటలను అందమైన లొకేషన్లలో తెరకెక్కించాం'' అని అన్నారు. ఎగ్జిక్యూటివ్ నిర్మాత విజయ్ మాట్లాడుతూ "పాటలు యువతను మెప్పించాయ''ని అన్నారు. సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని భీమినేని శ్రీనివాసరావు, అబ్బూరి రవి తెలిపారు. వరుణ్ మాట్లాడుతూ "ఇప్పటిదాకా ఎనిమిది సినిమాలు చేశాను. ఈ సినిమా వైవిధ్యంగా ఉంటుంది. క్రిస్ప్ సినిమా'' అని అన్నారు.
తన తొలి చిత్రం తప్పక అందరినీ మెప్పిస్తుందన్న నమ్మకం ఉందని సుమ చెప్పారు. "వరల్డ్ కప్‌కన్నా ముందు మా కుదిరితే కప్పు కాఫీ వస్తుంది. అందరూ చూసి ఎంజాయ్ చేయాలి'' అని దర్శకుడు అన్నారు. " పాటలు బాగున్నాయని అందరూ మెచ్చుకుంటుంటే ఆనందంగా ఉంది. నాన్న ప్రతి పాటనూ ఐదు నిమిషాల్లో రాసిచ్చేశారు. ఇ.యస్.మూర్తిగారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ చిత్రంలో రీరికార్డింగ్ మాత్రమే కాదు... కామెడీ, డైలాగులు కూడా బాగున్నాయి'' అని యోగేశ్వర్‌శర్మ అన్నారు. సంగీతం: యోగేశ్వర్‌శర్మ, పాటలు: సిరివెన్నెల, మాటలు: అబ్బూరి రవి, కూర్పు: అనిల్‌కుమార్.బి., కళ: శశిధర అడప, కెమెరా: సంతోష్‌రాయ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: విజయ్, నిర్మాతలు: శివ,మహి.