అణచివేతకు గురైన తన జాతిజనుల హక్కుల కోసం, స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన
మహావీరుడు కొమరంభీమ్ కు ఆదివాసిచిత్ర ఫిల్మీ మీడియా ప్రొడక్షన్స్ సంయుక్త నిర్మాణంలో
రూపొందిన అవార్డు చిత్రం ‘కొమరంభీమ్’ సినిమాకు విడుదలైన ప్రతిచోట అనూహ్య స్పందన
లభిస్తోంది. విడుదలైన మూడు నాలుగు రోజుల్లోనే ‘హిట్ ట్రెండ్’కు వెళ్ళిన ఈ చిన్న సినిమా పెద్ద
విజయాన్నే సాధిస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు అల్లాణి శ్రీధర్, కథానాయకుడు భూపాల్ రెడ్డి
తమ చిత్రానికి వచ్చిన ‘టాక్’ పట్ల, సాధిస్తున్న ప్రజాదరణ పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
‘‘నేనెంతో మనసుపెట్టి చేసిన కొమరం భీమ్ పాత్రకు ఇంతటి స్థాయిలో స్పందన రావటం, సినిమా
ఘనవిజయం సాధించటం చాలా ఆనందంగా వుంది. అభిరుచిగల ప్రేక్షకులు ఉత్తమ చిత్రాలకు
ఉన్నత విజయం అందిస్తారనే నా నమ్మకం నిజమైంది.’’ అంటున్నారు భూపాల్ - ఈ సినిమా
హీరో, పాటల రచయిత.
‘‘చీకటి కోణాల్లో దాచి వేయబడిన గిరిజన పోరాట యోధుడి కథ ఇది. ఎంతో కాలంగా విడుదల
కోసం ఎదురు చూస్తున్న సినిమా. ఇప్పటి ట్రెండ్ కి అనుగుణంగా డి.టి.యస్. చేశాం. మళ్ళీ కలర్
గ్రేడింగ్ చేయడం జరిగింది. ఈ సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారా? అని టెన్షన్ పడ్డాను. మొదటి
రోజు ‘హౌస్ ఫుల్’ అనే మాట వినబడగానే - ఆనందం పట్టలేకపోయాము. హైదరాబాద్ దీపక్ లో
ప్రజల మధ్య సినిమా చూశాము. ప్రేక్షకుల అభిరుచి, వారు చూపిస్తున్న అభిమానం చూశాక
సినిమా చూస్తున్న ప్రతీ ప్రేక్షకుడు ‘కొమరం భీమ్ సహచరుడి’లాగే కనిపించాడు నాకు. ‘కొమరం
భీమ్ వీర త్యాగం’ సన్నివేశం తర్వాత కూడా ప్రేక్షకులు అదే భావోద్వేగంతో అలాగే కూర్చుండి
పోవటం చూస్తుంటే, ‘అవార్డు సినిమాకు ఆదరణ వుండదు’ అన్నమాట అబద్ధం అనిపిస్తోంది.
‘‘అభిరుచిగల జనం - ఆదరిస్తున్న నిజం’’ మా లాంటి చిన్న నిర్మాతలకు ఆక్సిజన్ లా పని
చేస్తుంది. ఈ సినిమా నిర్మాణానికి కీ. శే. డా. పి.సుబ్రహ్మణ్యం ఐ.ఎ.ఎస్. గారు స్ఫూర్తి. ఈ చిత్రాన్ని
మాతో కలిసి పంపిణీ చేయడానికి ముందుకొచ్చిన ఎస్విఎస్ చిత్ర శ్రీనివాసరావుగారికి థ్యాంక్స్
చెప్పుకుంటున్నాం. ఈ సినిమా విడుదల కావడానికి ముఖ్యకారకులు - యఫ్.డి.సి. మేనేజింగ్
డైరెక్టర్ సి.పార్థసారధిగారు, గిరిజన సంక్షేమ శాఖ కమీషనర్ శ్రీమతి శాంతికుమారి గారు
కొమరంభీమ్ ఫౌండేషన్ సభ్యులు.
ఈ సినిమాకు ఇంతమంచి హిట్ టాక్ రావడానికి కారణం - ఆకట్టుకున్న పాటలు, తూటాల్లాంటి
మాటలు, పాత్రధారుల అభినయం - ఇలా అందరి కృషీ, శ్రమా! ఇప్పుడు అన్నీ ఏరియాల నుండి
ఎంక్వయిరీలు వస్తున్నాయి. మరిన్ని ప్రింట్లు వేసి అన్ని ఏరియాలకు పంపిస్తున్నాము. హిందీ,
గోండీ, భోజ్ పురి భాషల్లోకి కూడా కొమరం భీమ్ సినిమాను అనువదించనున్నాము. ఈ చిన్న
చిత్రానికి ఇంత మంచి విజయం అందిస్తున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియ
చెప్పుకుంటున్నాం’’ - అన్నారు చిత్ర నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత దర్శకుడు అల్లాణి శ్రీధర్.