Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
పవన్ కళ్యాణ్ ‘కొమరం పులి’ వస్తోంది!
     'ఖుషి 'లాంటి ఘనవిజయం తర్వాత పవన్‌కళ్యాణ్‌, ఎస్‌.జె.సూర్య కలయికలో వస్తోన్న చిత్రం 'కొమరం పులి'. కనకరత్న మూవీస్‌ పతాకంపై శింగనమల రమేష్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఒక పాట మినహా షూటింగ్‌ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చిత్రం విశేషాలను నిర్మాత బుధవారం విలేకరులకు తెలియజేస్తూ -"ఖుషి లాంటి సంచలనాత్మక చిత్రం తర్వాత - ఎటువంటి చిత్రాన్ని ప్రేక్షకులు ఎక్స్‌పెక్ట్‌ చేస్తారో.. సరిగ్గా అలాంటి చిత్రమే ఇది.

పవన్‌కళ్యాణ్‌ ఇందులో ఎంతో పవర్‌ఫుల్‌గా కనిపిస్తాడు. పూర్తి కమర్షియల్‌ హంగులతో రూపొందుతున్న చిత్రమిది' అన్నారు. నిర్మాత మాట్లాడుతూ -"బ్యాలెన్స్‌ షూటింగ్‌ను ఈ నెలాఖరుకు పూర్తిచేస్తాం. దర్శకుడు ఎస్‌.జె.సూర్య అన్ని వర్గాలకు మెచ్చే ఓ పవర్‌ఫుల్‌ కథతో చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం కథ విన్న సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రెహమాన్‌ ఎంతో ఇన్‌స్పైర్‌ అయ్యి అద్భుతంగా బాణీలను ఇచ్చాడు. రెహమాన్‌ ఈ చిత్రం రీ-రికార్డింగ్‌ను లండన్‌లో చేస్తున్నారు. సాంకేతికపరంగా తెలుగు సినిమా స్థాయిని పెంచే విధంగా ఈ సినిమా వుంటుంది.

త్వరలోనే సోని మ్యూజిక్‌ ద్వారా ఆడియోను విడుదల చేసి, జూన్‌ ద్వితీయార్ధంలో అత్యధిక ప్రింట్లతో ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేస్తాం' అని తెలిపారు. నికీషా పటేల్‌ నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మనోజ్‌ .వీఎంసీ హనీఫా, మాస్టర్‌ భరత్‌, అలీ, బ్రహ్మాజి, శ్రీ ధర్‌రావ్‌, జ్యోతికృష్ణ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: బినోద్‌. కె.ప్రధాన్‌, సమర్పణ: ఎస్‌.సత్యరామ మూర్తి.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com