'వినాయకుడు', 'విలేజ్‌లో వినాయకుడు'- చిత్రాలలో సాఫ్ట్‌గా, అమాయకుడిలా కనిపించిన
కృష్ణుడు ఉన్నట్టుండి లవర్‌బోయ్‌గా మారిపోయాడు.‘నాకూ ఓ లవరుంది’ అంటూ ప్రేక్షక
జనాల్ని ఊరించబోతున్నాడు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు శిష్యుడు కె.రామ్ వెంకీ
దర్శకుడిగా, రితిక నాయికగా పరిచయమవుతున్న ఈ తాజా చిత్రానికి మాస్టర్
హేమచంద్రారెడ్డి, బేబి హేమశ్రీ సమర్పకులు. శ్రీ శివపార్వతి కంబైన్స్ పతాకంపై కె.సురేష్‌బాబు
నిర్మిస్తున్నారు.
నిర్మాత మాట్లాడుతూ- ‘సినిమాపై ప్రత్యేక ఆసక్తితో బేనర్ ప్రారంభించాం. ఇదే తొలిచిత్రం.
మంచి సినిమాలు నిర్మించడమే ఆశయం. కృష్ణుడికి సరితూగే కథ కుదిరింది. ఫిబ్రవరి 14న
వేలెంటైన్‌డే సందర్భంగా ఆరోజు చిత్రీకరణ ప్రారంభిస్తున్నాం. ఆనంద్, గోదావరి, చందమామ
చిత్రాలకు సంగీతం అందించిన కె.ఎం.రాధాకృష్ణన్ ఈ సినిమాకి బాణీలందిస్తున్నారు. ప్రస్తుతం
పాటల రికార్డింగ్ జరుగుతోంది. తొలి ప్రయత్నాన్ని ఆశీర్విదిస్తారని ఆశిస్తున్నా’ అన్నారు.
|