ఫిలిం న్యూస్
 
 
 
 
‘కుదిరితే కప్పు కాఫీ’
యూత్ హీరో వరుణ్ సందేష్, సుమ భట్టాచార్య హీరోహీరోయిన్లుగా శివ ప్రొడక్షన్స్ (ప్రై) లిమిటెడ్ మరియు మూన్ వాటర్ పిక్చర్స్ (ప్రై) లిమిటెడ్ పతాకంపై రమణ సాల్వ దర్శకత్వంలో యువ నిర్మాతలు శివ, మహి విభిన్న ప్రేమకథా చిత్రం ‘కుదిరితే కప్పు కాఫీ’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫిబ్రవరి 11న విడుదల కానుంది.

ఈ సందర్భంగా నిర్మాతలు శివ, మహి మాట్లాడుతూ- ‘అందర్నీ అలరించే కథ, కథనాలతో చక్కని ప్రేమకథా చిత్రంగా రూపొందుతున్న ‘కుదిరితే కప్పు కాఫీ’ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ఈ చిత్రం ఫిబ్రవరి 11న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇప్పటికే విడుదలైన ఆడియోకి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి కుమారుడు యోగేశ్వర్ శర్మ అందించిన పాటలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటల్ని దర్శకుడు రమణ సాల్వ అద్భుతంగా పిక్చరైజ్ చేశారు. అరుదైన లొకేషన్లలో చిత్రీకరించిన ఈ పాటలు ప్రేక్షకులకు ఒక విజువల్ ఫీస్ట్ గా నిలుస్తాయి. మా బ్యానర్లో ఈ చిత్రం ఒక అపురూప చిత్రంగా నిలుస్తుందన్న నమ్మకం మాకు వుంది’ అన్నారు.

వరుణ్ సందేశ్, సుమ భట్టాచార్య, సుకుమారి, తనికెళ్ళ భరణి, శివనారాయణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : యోగేశ్వర్ శర్మ, పాటలు : సిరివెన్నెల సీతారామశాస్త్రి, మాటలు : అబ్బూరి రవి, ఎడిటింగ్ : అనిల్ కుమార్ బి., ఆర్ట్ : శశిధర అడప, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ : సంతోష్ రాయ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : విజయ్, నిర్మాతలు : శివ, మహి, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : రమణ సాల్వ.