ఫిలిం న్యూస్
 
 
 
 
డల్లాస్ కి ‘ఎల్బీ డబ్ల్యూ’
‘‘చిన్న సినిమాగా విడుదలై మంచి సినిమాగా పెద్ద పేరు తెచ్చుకోవడం మామూలు విషయం కాదు. డల్లాస్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్‌కి ఇండియా నుంచి మూడే మూడు సినిమాలు ఎంపికయ్యాయి. దోబీఘాట్, రోబోతో పాటు ఎల్బీడబ్ల్యూ ఎంపికైనందుకు మాకు చాలా గర్వంగా ఉంది. మా కష్టానికి, ప్రేక్షకుల ఇష్టానికి తగిన ప్రతిఫలమిది’’ అని నిర్మాతల్లో ఒకరైన కిరణ్ భూనేటి ఆనందం వెలిబుచ్చారు. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ఎ వర్కింగ్ డ్రీమ్ ప్రొడక్షన్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం యాభై రోజుల వేడుక మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది.

ఎడిటర్ ధర్మేంద్ర మాట్లాడుతూ- ‘‘33 రోజుల్లో తక్కువ నిర్మాణ వ్యయంతో రెడ్ కెమెరాతో చిత్రీకరించాం. కథను నమ్మి దర్శకుడు చేసిన ఈ ప్రయత్నం బాగా సఫలీకృతమైంది’’ అని తెలిపారు. మంచి సినిమా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారన డానికి ఎల్బీడబ్ల్యూ నిదర్శనమని హీరోలు సిద్దు, అభిజిత్, హీరోయిన్లు నిశాంతి, చిన్మయి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా కృష్ణ చిన్ని, విజయ్‌కుమార్ సజ్జా, చాణక్య, ఎంఎస్.వి.ఎస్.ప్రసాద్ పాల్గొన్నారు.