Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
‘లీడర్‌’ రానా
     ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణసంస్థ ఏవియం తమ 174వ చిత్రంగా నిర్మిస్తున్న ‘లీడర్‌’ చిత్రం షూటింగ్‌ మొత్తం పూర్తి చేసుకుంది. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా ప్రముఖ నిర్మాత డా. డి.రామానాయుడు మనవడు, సురేష్‌బాబు తనయుడు రానా (రామానాయుడు) హీరోగా పరిచయం అవుతున్నారు. ఒక విభిన్నమైన ఇతివృత్తంతో రూపొందిన ఈ చిత్రం ఆడియో ఈ నెలాఖరులో విడుదల కానుంది. డిసెంబర్‌ ఆఖరులో సినిమా విడుదల కానుంది. ఈ విషయాన్ని ఏవియం అధినేతలు యమ్‌.శరవణన్‌, యమ్‌.యస్‌.గుహన్‌, అరుణ గుహన్‌, అపర్ణలు తెలిపారు. ‘హ్యాపీడేస్’ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. రానా, రిచా గంగోపాధ్యాయ్‌, ప్రియా ఆనంద్‌, కోట శ్రీనివాసరావు, సుహాసిని, హర్షవర్ధన్‌, తనికెళ్ళ భరణి, సుబ్బరాజు, రావు రమేష్‌, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు: వేటూరి సుందరరామ్మూర్తి, ఛాయాగ్రహణం: విజయ్‌ సి.కుమార్‌, కళా దర్శకత్వం: తోట తరణి, ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, సంగీతం: మిక్కీ జె.మేయర్‌, నిర్మాణం: ఏవియం ప్రొడక్షన్స్‌, నిర్మాతలు: యం.శరవణన్‌, యమ.యస్‌,గుహన్‌, అరుణ గుహన్‌, అపర్ణ, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శేఖర్‌ కమ్ముల.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com