Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
రానా 'లీడర్‌' రెడీ‌
     ప్రముఖ నిర్మాత డా||డి.రామానాయుడి మనవడు రానా కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం 'లీడర్‌'. శేఖర్‌ కమ్ముల దర్శకుడు. 'హ్యాపీడేస్‌' తర్వాత ఆయన రూపొందిస్తున్న చిత్రమిది. రీచా గంగోపాధ్యాయ్‌, ప్రియా ఆనంద్‌ నాయికలు. దర్శకుడు మాట్లాడుతూ ''ప్రజలు మెచ్చే నిజమైన నాయకుడు ఎలా ఉంటాడో మా చిత్రంలో చూపించాం. ఎన్నికల సమయంలో పలు చానెళ్ళను చూస్తున్న సమయంలో పుట్టిన ఆలోచనలో నుంచి అల్లుకున్న కథే 'లీడర్‌'. అందరినీ అలరిస్తుంది. యువతలో ఆలోచనను రేకెత్తిస్తుంది. వేటూరి సాహిత్యం అందరి ప్రశంసలు పొందుతోంద''ని అన్నారు. నిర్మాతలు ఎం.శరవణన్‌, ఎమ్మెస్‌ గుహన్‌, అరుణ, అపర్ణ మాట్లాడుతూ ''నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇటీవల సెన్సార్‌ పనులు కూడా ముగిశాయి. క్లీన్‌ యు సర్టిఫికెట్‌ను అందజేశారు. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామ''ని అన్నారు. కోట శ్రీనివాసరావు, సుహాసిని, హర్షవర్ధన్‌, తనికెళ్ళ భరణి, సుబ్బరాజు, రావు రమేష్‌ తదితరులు ఇతర పాత్రధారులు. పాటలు: వేటూరి, సంగీతం: మిక్కీ.జె.మేయర్‌, కళ: తోట తరణి, కూర్పు: మార్తాండ్‌.కె.వెంకటేష్‌.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com