ఫిలిం న్యూస్
 
 
 
 
29న ‘100% లవ్’
ఏమాయ చేశావే చిత్రం తో యువత హృదయాలన్ని దోచుకున్న నాగచైతన్య, తమిళం, తెలుగు భాషల్లో బిజీ హీరోయిన్ గా వున్న మిల్క్ బ్యూటీ తమన్నాలు జంటగా నటిస్తున్న, ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో, క్రియేటివ్ లవ్లీ డైరక్టర్ సుకుమార్ దర్శకత్వంలో, బన్నివాసు నిర్మాతగా పరిచయం అవుతూ కూట్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న 100% లవ్ చిత్రం ఏప్రిల్ 29న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా...

నిర్మాత బన్ని వాసు మాట్లాడుతూ - సుకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందించటం చాలా సంతోషంగా వుంది. ప్రతి సన్నివేశం చెప్పినదానికంటే అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ సమ్మర్ లో కూల్ లవ్ ఎంటర్ టైనర్ గా యూత్ ని ఆకట్టుకునే చిత్రంగా మా 100% లవ్ నిలుస్తుంది. ఇప్పటికే బిజినెస్ పరంగా సూపర్ క్రేజ్ ని సంపాయించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా అదే క్రేజ్ ని ఏర్పరుస్తుందని గట్టిగా నమ్ముతున్నాము. దేవిశ్రీప్రసాద్ అందించిన ఆడియో అద్భుతంగా వచ్చింది. ఈ ఆడియోని పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో విడుదల చేసి చిత్రాన్ని ఏప్రిల్ 29న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము. నాకు ఎల్లప్పుడు సపోర్ట్ చేస్తున్న మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నన్ను నిర్మాతగా పరిచయం చేస్తున్నారు. అలాగే మా చిత్ర యూనిట్ లో ప్రతి ఒక్కరు 100% సపోర్ట్ ఇచ్చారు వారికి పేరు పేరున ధన్యవాదాలు’ అని అన్నారు. సమ్మర్ లో వైవిధ్య ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పించగా, సంగీతం : దేవిశ్రీప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఎడిదరాజా, నిర్మాత : బన్నివాసు, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : సుకుమార్