ఎగ్జామ్‌లో ఫెయిలైనా తట్టుకునే కుర్రాళ్లు... లవ్‌లో ఫెయిలైతే మాత్రం అస్సలు జీర్ణించుకోలేరు. లవ్‌లో ఎంత పవర్ ఉంటుందో లవ్
ఫెయిల్యూర్‌లో అంత పెయిన్ ఉంటుంది. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు చిత్రాల్లో ప్రేమను గెలుచుకునే కుర్రాడిగా కనిపించి
ఆకట్టుకున్న సిద్దార్థ్ ఈసారి ఎందుకనో ‘లవ్ ఫెయిల్యూర్’ వైపు దృష్టి సారించారు.
అదే టైటిల్‌తో ప్రస్తుతం ఆయనో సినిమా చేస్తున్నారు. ఇందులో ఆయన సరసన అమలాపాల్ కథానాయికగా చేస్తున్నారు. బాలాజీ
మోహన్ దర్శకత్వంలో వైనాట్ స్టూడియోస్ అధినేత ఎస్.శశికాంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి స్పెషల్
హైలైట్ ఏమిటంటే - సిద్దార్థ్ దీనికి నిర్మాణ భాగస్వామి. డైరక్టర్ కాబోయి హీరో అయిన సిద్దార్థ్ ఇప్పుడు ప్రొడ్యూసర్ అవతారం ఎత్తారు.
ఇందుకోసం ఎటాకి ఎంటర్‌టైన్‌మెంట్ పేరుతో ఓ నిర్మాణ సంస్థను స్థాపించారు. కెమెరామన్ నిరల్‌షా కూడా సహనిర్మాతగా
వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రానికి సంగీతం: థమన్.