ఫిలిం న్యూస్
 
 
 
 
ఇస్తాంబుల్‌లో 'లవ్‌లీ'

ఆది, శాన్వి జంటగా ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సమర్పణలో ఆర్.జె. సినిమాస్ నిర్మిస్తున్న 'లవ్‌లీ' చిత్రం షూటింగ్ మంగళవారం నుంచి టర్కీలోని ఇస్తాంబుల్‌లో జరుగుతుంది. ఫిబ్రవరి 3 వరకూ అక్కడ పాటలను చిత్రీకరిస్తారు. ఈ సందర్భంగా దర్శకురాలు జయ మాట్లాడుతూ 'అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే చిత్రంగా 'లవ్‌లీ' రూపొందుతోంది. టర్కీ షెడ్యూల్‌తో దాదాపుగా చిత్రం పూర్తవుతుంది. ఈ సినిమాతో ఆది పెద్ద రేంజ్ హీరో అవుతాడు.

రాజేంద్రప్రసాద్‌గారు కీలకపాత్ర పోషిస్తున్నారు' అని తెలిపారు. నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ 'సెన్సేషనల్ హిట్ చిత్రం 'బిజినెస్‌మేన్' తరువాత డా.వెంకట్‌గారి సమర్పణలో 'లవ్‌లీ' చిత్రం చాలా భారీగా నిర్మాణమవుతోంది. ఈ సినిమాలోని పాటలు మరింత లవ్‌లీగా ఉండాలని ఇస్తాంబుల్, కపడోషియా, ఆంటాల్యా, పాముక్కలే, కార్టెపె మౌంటటైన్‌లో చిత్రీకరిస్తున్నాం. ఫిబ్రవరిలో ఆడియోను విడుదల చేస్తాం' అన్నారు. ఈ చిత్రానికి సంగీతం:అనూప్ రూబెన్స్, ఫొటోగ్రఫీ: ఎస్.అరుణ్‌కుమార్, లైన్ ప్రొడ్యూసర్: బి.శివకుమార్.