ఫిలిం న్యూస్
 
 
 
 
‘రొటీన్ లవ్‌స్టోరీ'

‘‘ఇదొక రొమాంటిక్ ఎంటర్‌టైనర్. ఇందులో 80 శాతం కామెడీ ఉంటుంది. ఓ లాజిక్‌తో బతికేసే కుర్రాడు, అదే లాజిక్‌తో తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడనేది ఈ చిత్ర ప్రధానాంశం. అందరూ తమ ప్రేమ చాలా డిఫరెంట్ అనుకుంటారు. కానీ కొన్ని అంశాలను గమనిస్తే తమదీ రొటీన్ ప్రేమకథే అనిపిస్తుంది. ఇదంతా వినోదాత్మకంగా చూపిస్తున్నాం’’ అని దర్శకుడు ప్రవీణ్ సత్తారు అన్నారు.

‘ప్రస్థానం’ఫేం సందీప్, రెజీన జంటగా ప్రవీణ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘రొటీన్ లవ్‌స్టోరీ’. చాణక్య బూనేటి, పి.మణికుమార్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా విశేషాలను చెబుతూ దర్శకుడు పై విధంగా స్పందించారు. ‘‘అక్టోబర్ 31న చిత్రీకరణ మొదలుపెట్టాం. ఈ నెల 27 వరకూ హైదరాబాద్‌లో తొలి షెడ్యూలు చేస్తాం. డిసెంబర్‌లో ఉత్తరాంచల్‌లో రెండో షెడ్యూలు చేస్తాం. ఇందులో మొత్తం ఐదు పాటలు ఉంటాయి. పాటల రికార్డింగ్ ఇప్పటికే పూర్తయింది.

ఫిబ్రవరిలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని నిర్మాతలు తెలిపారు. ఎమ్మెస్ నారాయణ, కృష్ణుడు, జయప్రకాష్‌రెడ్డి, హేమ, సురేఖావాణి, ఝాన్సీ, మాస్టర్ భరత్, తాగుబోతు రమేష్, స్నిగ్థ, స్వప్నక్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె. మేయర్. కెమెరా: సురేష్, చోటా కె.నాయుడు, ఎడిటింగ్: ధర్మేంద్ర, ఆర్ట్: ఉపేంద్ర, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అర్చన బూనేటి.