Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
ఆర్య 'మదరాసు పట్టణం'
     వరుడు, సర్వం చిత్రాలద్వారా తెలుగువారికి పరిచయమైన ఆర్య కథానాయకుడిగా రూపొందిన చిత్రం 'మదరాసు పట్టణం'. ఎజిఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. పతాకంపై కల్పాతి ఎస్‌.అఘోరం సమర్పణలో కల్పాతి ఎస్‌.అఘోరం, ఎస్‌.గణేష్‌, ఎస్‌. సురేష్‌ నిర్మించారు. చిత్ర విశేషాలను ఎస్‌.అఘోరం చెపుతూ... ఇండియాకు స్వాతంత్య్రం రాకముందు ఆంధ్రా, మద్రాస్‌ కలిసి ఉన్న రోజుల్లో 1946లో జరిగిన కథ ఇది. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి 1946లో మద్రాస్‌ పట్నం ఎలా ఉండేదో అలా భారీగా సెట్స్‌వేసి అప్పటి వాతావరణాన్ని క్రియేట్‌ చేసి 140 రోజులపాటు ఈ చిత్రాన్ని నిర్మించాం. తమిళంలో ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించింది. తెలుగులోకూడా ఆదరణ పొందుతుందనే నమ్మకముంది' అన్నారు.

హీరో ఆర్య మాట్లాడుతూ... మదరాసులో హీరోగా మంచి పేరు ఉంది. తెలుగులోనూ ఆదరిస్తారనే భావిస్తున్నాను. అత్యంత భారీస్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించారు' అని చెప్పారు. ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత మాలి మాట్లాడుతూ... ఈ చిత్రాన్ని రెడ్‌జైంట్‌ మూవీస్‌ అధినేత ఉదయనిధి స్టాలిన్‌ చూసి ఇంప్రెస్‌ అయి తమిళనాడు అంతటా ధియేటర్‌ రైట్స్‌ కొని 196 కేంద్రాల్లో విడుదలచేశారు. 120 సెంటర్లలో అర్థశతదినోత్సవానికి పరుగులు తీస్తూ ఇప్పటికే 14కోట్ల షేర్‌ను రాబట్టింది. ఈనెలాఖరులో తెలుగులో విడుదలచేయనున్నాం' అన్నారు.

ఏమీజాక్సన్‌, నాజర్‌, బాలాసింగ్‌ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: జివి ప్రకాష్‌కుమార్‌, కెమెరా:నిరోషా, మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, పాటలు: చంద్రబోస్‌, సాహితి, దర్శకత్వం: విజరు.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com