ఫిలిం న్యూస్
 
 
 
 
నరేష్ 'మడత కాజా'

అల్లరి నరేష్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘మడత కాజా’. స్నేహా ఉల్లాల్‌ కథానాయిక. సీతారామరాజు దంతులూరి దర్శకుడు. రంజిత్‌మూవీస్‌ సమర్పణలో టింటు ప్రొడక్షన్స్‌ పతాకంపై వేదరాజ్‌ టింబర్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా పతాకసన్నివేశాల చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది.

నరేష్‌ మాట్లాడుతూ...'ఎదుటివాడిని మాటల్తో మడత పెట్టేవాడిని మతడకాజ అంటారు. అలా ఎదుటివారిని మాటల్తో గారడీ చేసే పాత్ర. వైజాగ్‌ నుంచి కథానాయికను బ్యాంకాక్‌ తీసుకెళతాను. అక్కడ నుంచి హైదరాబాద్‌ వస్తాను. ఇలా ఎందుకు జరిగిందనే పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌తో తెరకెక్కించారు. చేసిన చిత్రాల్లో వైవిధ్యంగా ఉంటుంది. డబ్బింగ్‌కూడా పూర్తయింది. వసంత్‌ సంగీతం బాగుంది' అని తెలిపారు.

దర్శకుడు మాట్లాడుతూ ‘విశాఖలో తొలిషెడ్యూల్‌ చేశాం. ప్రస్తుతం హైదరాబాద్‌లో పతాకసన్నివేశాలు చిత్రీరిస్తున్నాం. త్వరలో బ్యాంకాక్‌లో 2పాటలు, కీలకసన్నివేశాలు చిత్రీకరిస్తాం’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘నెలాఖరున ఆడియో, సెప్టెంబర్‌లో సినిమా విడుదల చేస్తాం’ అన్నారు.

స్నేహ ఉల్ల్లాల్‌ మాట్లాడుతూ...'నాకు ప్రత్యేకమైన చిత్రం. నరేష్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. దర్శకుడు కావల్సింది రాబట్టుకుంటున్నారు' అని అన్నారు.

సమర్పకుడు దామోదరప్రసాద్‌ మాట్లాడుతూ- 'నరేష్‌ కెరీర్‌లో వైవిధ్యమైన చిత్రమని అన్నారు. 'అలా మొదలైంది' సినిమాకు రెండు నందులు వచ్చాయి. నాతో సినిమా చేయడానికి చాలామంది వచ్చారు. అందులో ఈ నిర్మాత ఒకరు. కథ చాలా బాగుంది. నచ్చి చేస్తున్నాం. ప్రస్తుత కథ ఎంటర్‌టైన్‌మెంట్‌లో సాగుతుంది. వచ్చేనెల మొదటి వారంలో ఆడియోను, నెలాఖరున సినిమాను విడుదల చేస్తామని తెలిపారు.

సుబ్బరాజు, జయప్రకాష్‌, ఆహుతిప్రసాద్‌, ఆశిష్‌విద్యార్థి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శ్రీవసంత్‌, కెమెరా: అడుసుమిల్లి విజయ్‌కుమార్‌, కథ-కథనం-దర్శకత్వం: సీతారామరాజు దంతులూరి.