ఫిలిం న్యూస్
 
 
 
 
‘‘ది బిజినెస్ మేన్’’
‘ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు..!’ ‘పోకిరి’ చిత్రంలోని ఈ పవర్‌ఫుల్ డైలాగ్‌ని ఇప్పటికీ ఎవ్వరూ మరిచిపోలేరు. మహేష్‌బాబు, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా సాధించిన సంచలన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే విజయం సాధించిన ఈ కాంబినేషన్‌లో మరో చిత్రం రానుంది.

‘ది బిజినెస్ మేన్’ పేరుతో ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళనున్న ఈ సినిమా విశేషాలను నిర్మాత వెంకట్ తెలియజేస్తూ ‘‘ సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఇంతకు ముందు పోషించనటువంటి పవర్‌ఫుల్ పాత్రను ఈ చిత్రంలో చేస్తారు. పూరి చెప్పిన లైన్‌కు మహేష్ బాగా ఇంప్రెస్ అయ్యారు.

‘గన్స్ డోన్డ్ నీడ్ అగ్రిమెంట్సు’ అనేది ఈ చిత్రం ఉపశీర్షికతో దీనిని బట్టి ఇది ఎంతటి సంచలనాత్మకంగా వుంటుంతో ఊహించుకోవచ్చు. గతంలో ఈ ఇద్దరి కలయికలో వచ్చిన పోకిరిని మించే విధంగా ఈ చిత్రం వుంటుంది. సెన్సేషన్ కాంబినేషన్‌లో రూపొందనున్న ఈ చిత్రం తప్పకుండా తెలుగు సినిమా చరిత్రలో అద్భుతాలు సృష్టిస్తుందనే నమ్మకం వుంది’’ అని తెలిపారు.