మహేష్‌బాబు హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ఫిబ్రవరిలో ఓ భారీ చిత్రం ప్రారంభంకాబోతుంది. వెంకటేష్ తో 'నమో వెంకటేశా' చిత్రాన్ని నిర్మిస్తున్న రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర ‘14రీల్ ఎంటర్‌టైన్‌మెంట్’ పతాకంపై ద్వితీయ చిత్రంగా నిర్మిస్తున్నారు.
మహేష్‌బాబు మాట్లాడుతూ- 'శ్రీనువైట్ల చెప్పిన కథ చాలా బాగుంది. కొత్తదనంతో కూడిన మాస్ ఎంటర్ టైనర్‌గా అందర్నీ అలరిస్తుంది' అని చెప్పారు.
శ్రీనువైట్ల మాట్లాడుతూ- 'మహేష్ బాబుతో నేను తొలిసారిగా చేస్తున్నాను. యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే లవ్‌స్టోరీ ఇది. మొదటి భాగం నార్త్ ఇండియాలో జరుగుతుంది. ఎంటర్‌టైన్‌మెంట్, రొమాన్స్, యాక్షన్ మిక్స్ అయి వుండే ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉంటాయి. కథాపరంగా టెక్నికల్ వాల్యూస్‌కు ప్రాధాన్యత వుండే ఈ చిత్రం మహేష్ బాబు పొటెన్షియాలిటీకి తగినట్లుగా వుంటుంది. మహేష్ బాబు నుంచి ఆడియన్స్, ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలూ ఇందులో వుంటాయి. ముఖ్యంగా నా నిర్మాతలు రామ్, గోపి, అనిల్ లను ప్రోత్సహించి, వారికి ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేసే అవకాశం ఇచ్చిన మహేష్ బాబుకి థ్యాంక్స్ చెపుతున్నాను' అని తెలిపారు.
నిర్మాతలు మాట్లాడుతూ- ' ఇంత భారీ ప్రాజెక్ట్ నిమా బ్యానర్లో చేసే అవకాశం ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మా మీద నమ్మకంతో మహేష్ బాబు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పెద్ధస్థాయిలో, మహేష్ బాబు అభిమానులకు కన్నులపండువగా వుండే విధంగా ప్లాన్ చేశాం. శ్రీనువైట్ల, మహేష్ బాబుల ఫస్ట్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాను ఓ సెన్సేషనల్ హిట్ గా రూపొందిస్తాం. జనవరిలో 'నమో వెంకటేశా' రిలీజ్ కాగానే ఫిబ్రవరిలో చిత్రాన్ని ప్రారంభిస్తాం. ఇతర నటీనటుల వివరాలు త్వరలో తెలియజేస్తాం అన్నారు.