Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
సునీల్ హీరోగా రాజమౌళి ‘మర్యాద రామన్న’
     ‘వేదం’ చిత్రాన్ని నిర్మించిన ఆర్కా మీడియా వర్క్స్ సునీల్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ‘మర్యాద రామన్న’ చిత్రాన్ని నిర్మించింది. దీన్ని జూలై 23న విడుదల చేయాలనుకుంటున్నారు. రాజమౌళి ఈ చిత్రం గురించి చెబుతూ- ‘రాయలసీమ కక్షలు, కార్పణ్యాలకు పెట్టింది పేరు. అలాగే అతిథి మర్యాదలకు కూడా ఈ ప్రాంతం ప్రసిద్ది చెందింది. ఈ రెండు లక్షణాల నుండి హాస్యాన్ని ఈ చిత్రంలో చూపుతున్నాం. ‘మగధీర’కు ముందే ‘మర్యాదరామన్న’ అనుకున్నాం. నిజానికి ఇది నా స్కూల్ చిత్రం కాదు. సునీల్ మంచి నటుడిగా అందరికీ తెలుసు. నేను అతని స్కూల్కి వెళ్ళి ఈ చిత్రం చేశాను. వల్గారిటీ, వయెలెన్స్ లేకుండా కుటుంబసమేతంగా చూసేలా ఈ చిత్రం వుంటుంది. ‘మగధీర’లో చిన్న పాత్ర చేసిన సలోని నటన నచ్చి ఇందులో హీరోయిన్ గా తీసుకున్నాం. ప్రసాద్ ల్యాబ్ నాగినీడు ఇందులో ఓ ప్రధాన పాత్ర పోషించారు. రాంప్రసాద్ ఫోటోగ్రఫీ, రవి కళానైపుణ్యం, కాంబి రచనా సహకారం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణలు. కీరవాణి సంగీతంలో ‘తెలుగమ్మాయి’ పాట అందరినీ ఆకట్టుకుంది’- అని అన్నారు.

సునీల్ మాట్లాడుతూ- ‘ఇందులో యాక్షన్ లేకపోయినా థ్రిల్స్ వుంటాయి. పాత్రపరంగా నేను చేసే నటన ప్రేక్షకులను నవ్విస్తుంది. ఇది చిన్న పెద్ద సినిమా. తెలుగులో చాలా కొత్త సినిమా-’ అని అన్నారు. కీరవాణి మాట్లాడుతూ-‘ఈ చిత్రం చూస్తే ‘మాయాబజార్’ గుర్తొచ్చింది. ఇటువంటి చిత్రాలు ఎన్నోస్తే పరిశ్రమ అంత బాగుంటుంది’- అన్నారు.

ఈ కార్యక్రమంలో నిర్మాతలలో ఒకరైన శోభు యార్లగడ్డ, హీరోయిన్ సలోని, నాగినీడు, కాంచి పాల్గొన్నారు.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com