వేణు, ఛార్మి జంటగా దిలీప్ పోతన్ దర్శకుడిగా సాంబశివ క్రియేషన్స్ పతాకంపై బేబి జ్యోతిక సమర్పణలో యలమంచిలి నాగరాణి నిర్మాణ
సారధ్యంలో యలమంచి రవిచందర్ నిర్మిస్తున్న ‘మాయగాడు’ సినిమా ఈ నెల 15న విడుదల కానుంది. కాగా సినిమా ఆడియో ఇీవల
విడుదలై ప్లాటినం డిస్క్ ను సాధించింది. ఈ ప్లాటినం డిస్క్ ప్రధానోత్సవం విన్ ఫ్లోరా హోటల్ లో జరిగింది.
ఈ కార్యక్రమంలో చక్రి, యలమంచిలి రవిచందర్, దిలీప్ పోలన్, వేణు, ధనిఏలె, రవివర్మ తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు సినిమా యూనిట్ కు ప్లాటినం డిస్క్ లను అందజేశారు.
దిలీప్ పోలన్ మాట్లాడుతూ - కామెడీ ప్రధానంగా ఈ సినిమాను రూపొందించాము. ఈ సినిమా కామెడీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
నిర్మాత రాజీ పడకుండా సినిమాను రూపొందించారు. వేణు తన సహకారాన్ని అందించారు. సినిమాలో వేణు పాత్ర మాయ చేస్తూ ఉంటుంది.
ఈ సినిమాకు చక్రి ఆరు వైవిధ్యమైన పాటలను ఇచ్చారు. సినిమా విడుదలకు ముందే ప్లాటినం డిస్క్ అందుకోవడం ఆనందంగా ఉంది
అన్నారు.
చక్రి మాట్లాడుతూ - దర్శకుడి అభిరుచి మేరకు పాటలను కంపోజ్ చేయడం జరిగింది. పాటల్లో అన్ని రసాలు ఉంటాయి. అలాగే సినిమాకు
మంచి సాహిత్యం కూడా తోడయింది. ఈ నెల 15న విడుదల కానున్న ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని ఆశిస్తున్నాను
అన్నారు.
రవిచంద్ర మాట్లాడుతూ - ఈ నెల 15న సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాము. ఆడియో హిట్ అయ్యింది. సినిమా తప్పకుండా
మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు.
వేణు మాట్లాడుతూ - నేను నటించిన ‘గోపి గోపిక గోదావరి’ సినిమా చక్రి సంగీతం వల్ల మంచి విజయాన్ని సాధించింది. ఆ సినిమా
తరువాత సంగీతపరంగా అంత మంచి పాటలు ఈ సినిమాకు కుదిరాయి. చక్రి చాలా మంచి సంగీతాన్ని అందించారు. నిర్మాత ఈ సినిమా
కోసం చాలా కష్టపడ్డారు. ఆయన కష్టం ఫలించి మాకు మంచి ఫలితాలు అందాలని కోరుకుంటున్నాను అన్నారు.
రవివర్మ మాట్లాడుతూ - చక్కటి కలయికలో రూపొందిన ఈ సినిమా తప్పకుండా వందరోజులు ఆడాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా
ప్లాటినం డిస్క్ అందుకోవడం ఆనందంగా ఉంది అన్నారు.