రామ్‌చరణ్, కాజల్ జోడి మరోసారి జతకడుతోంది. మెగా సూపర్‌గుడ్ ఫిలింస్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కి స్తోంది. ధరణి దర్శకుడు. ఆర్.బి. చౌదరి సమర్పిస్తున్న ఈ చిత్రానికి ఎన్వీ ప్రసాద్, పారస్‌జైన్‌లు నిర్మాత లు. దేవిశ్రీ ప్రసాద్ తొలిసారి రామ్ చరణ్ చిత్రానికి బాణీలు సమకూర్చుతున్నారు. ప్రముఖ ఛాయాగ్రహకుడు పి.సి.శ్రీరామ్ ఛాయగ్రహణం అందిస్తున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. రామ్‌చరణ్, కాజల్‌పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి చిరంజీవి క్లాప్‌నివ్వగా ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు కెమేరా స్విచ్చాన్ చేశారు. ధరణి గౌరవ దర్శకత్వం వహించారు.
అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాతలలో ఒకరైన ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ - ‘‘రామ్‌చరణ్ నటిస్తున్న నాల్గవ చిత్రాన్ని నిర్మించే అవకాశం మా సంస్థకు రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నాం. తన గత చిత్రం ‘మగధీర’ స్థాయికి తగ్గ విజయాన్ని అందించే బాధ్యత మాపై ఉంది. అందరి అంచనాలకు తగ్గట్టే ఈ చిత్రాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాము. అవకాశమిచ్చిన చిరంజీవి, రామ్‌చరణ్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు’’ అన్నారు.
ధరణి మాట్లాడుతూ -‘రామ్‌చరణ్ ఇందులో ‘మెరుపు’ లాంటి యువకుడి పాత్రను పోషిస్తున్నారు. ఆ మెరుపును ఎవరు పట్టు కోలేరు. ఒక లక్ష్యం కోసం కష్టపడి తాను అనుకున్నది సాధించే పాత్ర ఆయనది’’ అన్నారు. పి.సి.శ్రీరామ్ మాట్లాడుతూ - ‘‘చెర్రీతో కలిసి ఈ సినిమాకు పనిచేయడం సంతోషంగా ఉంది. ధరణి చిత్రానికి నేను ఛాయా గ్రహణం అందించడం ఆనందంగా ఉంది’’ అన్నారు.
ఆర్.బి.చౌదరి మాట్లాడుతూ -‘‘రామ్‌చరణ్, కాజల్ కాంబినేషన్‌లో ‘మగధీర’ వంటి హిట్ చిత్రం తరువాత వస్తున్న ఈ చిత్రాన్ని ధరణి అందరినీ అలరించేలా రూపొందిస్తారన్న నమ్మకం ఉంది’’ అన్నారు.
రామ్‌చరణ్ మాట్లాడుతూ -‘‘ఒకే తరహా పాత్రలు చేయకూడదన్న ఉద్దేశ్యంతో నా తొలి చిత్రం ‘చిరుత’ నుంచి తాజాగా చేస్తున్న ‘ఆరంజ్’ వరకు ప్రతి చిత్రంలోనూ వైవిధ్యభరితమైన పాత్రలను పోషిస్తూ వస్తున్న నేను ఈ చిత్రంలో కూడా ఓ డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నాను. నాన్నగారు నటించిన ‘విజేత’ చిత్రం లోని పాత్రను చూస్తుంటే ఎలాంటి ఫీలింగ్ వచ్చిందో అలాంటి అనుభూతినే ఇందులోని నా పాత్ర అందిస్తుంది. ధరణి చెప్పిన స్క్రిప్ట్ చాలా బాగా నచ్చింది. తమిళంలో పలు హిట్ చిత్రాలను అందించిన ధరణి ఈ చిత్రం కోసం చెప్పిన పాయింట్ నన్ను ఎంతగానో ఇన్‌స్ఫైర్ చేసింది’ అన్నారు.