ఫిలిం న్యూస్
 
 
 
 
అమెరికాలో 'మై హార్ట్ ఈజ్ బీటింగ్' ...అదోలా

ధర్మ పధ క్రియేషన్స్ పతాకం ఫై ' గౌతమ బుద్ధ' చిత్రాన్ని నిర్మించి , నంది అవార్డ్ అందుకొన్న అభిరుచిగల నిర్మాత కే. రాజ శేఖర్ మలి ప్రయత్నం గా అమెరికా నేపధ్యం లో సాగే చక్కటి ప్రేమ కధా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ' మై హార్ట్ ఈజ్ బీటింగ్' [...అదోలా] అనే పేరు తో నిర్మిస్తున్న ఈ చిత్రం అమెరికాలోని అందమైన ప్రదేశాల్లో షూటింగ్ పూర్తి చేసుకుందని , ఈచిత్రాన్ని పూర్తిగా అమెరికాలోనే చిత్రీకరించడం విశేషం అని నిర్మాత కే. రాజ శేఖర్ చెప్పారు. కేవలం ప్రేమకే పరిమితం కాకుండా ...బాధ్యతలను కూడా గుర్తు చేస్తూ పిల్లలు ,తల్లి దండ్రుల మధ్య మనసుని హత్తుకునేలా సన్నివేశాలను చేసామని చెప్పారు. రెండు గంటల పాటు అమెరికా అందాలతో కనుల పండువగా ఉండే ఈ చిత్రం లో - అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ ' న్యూ యార్క్ స్కూల్ ఆఫ్ యాక్టింగ్' లో శిక్షణ పొందిన వారు నటించారని , ప్రధాన జంటగా చేసిన రేవంత్-రాజిత మంచి నటన ప్రదర్శించారని చెప్పారు. అరుణ్ రుద్ర- కిరణ్ మీగడ ప్రతిభా వంతంగా చిత్రాన్ని రూపొందించారని చెప్పారు. ప్రస్తుతం రీ - రికార్డింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం కోసం మైఖేల్ మక్కల్ మెలోడితో కూడిన 7 మధుర మైన పాటలు అందించారని ....ఈ నెలాఖరు లో పాటలు విడుదల చేసి, ఫిబ్రవరి రెండవ వారం లో సినిమాని విడుదల చేస్తామని చెప్పారు.

రేవంత్, రాజిత , కే.రాజ శేఖర్ , శ్రీని కొల్లా, సరయు సిరి, రజనీ కాంత్, ఫణి , మార్క్, రేష్మి ఠాకూర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కధ: అరుణ్ రుద్ర, ఫోటో గ్రఫీ: మురళి పలికొండ, సంగీతం : మైఖేల్ మక్కల్ , కొరియో గ్రఫీ:శివ సాయి, స్క్రీన్ ప్లే- దర్శకత్వం : అరుణ్ రుద్ర- కిరణ్ మీగడ , నిర్మాత :కే. రాజ శేఖర్