Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
డిసెంబర్ 23న రవితేజ ‘మిరపకాయ్’
      కృష్ణ, కిక్, డాన్ శీను వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత క్రేజీస్టార్ రవితేజ హీరోగా యువ దర్శకుడు హరీష్ శంకర్ ఎస్. కథ, మాటలు, దర్శకత్వంలో ఎల్లో ఫ్లవర్స్ బేనర్ పై నవ నిర్మాత రమేష్ పుప్పాల నిర్మిస్తున్న భారీ చిత్రం ‘మిరపకాయ్’ షూటింగ్ పార్ట్ పూర్తయ్యింది. ఈ సందర్భంగా నిర్మాత రమేష్ పుప్పాల మాట్లాడుతూ- ‘రవితేజతో మా సంస్థ నిర్మించిన మొట్టమొదటి చిత్రం ‘మిరపకాయ్’ షూటింగ్ పూర్తయ్యింది. హైదరాబాద్, రాజమండ్రి, స్విట్జర్లాండ్, బ్యాంకాక్ లలో చాలా లావిష్ గా ఈ చిత్రాన్ని నిర్మించాం. రవితేజ ఎక్స్ ట్రార్డినరీ పెర్ఫార్పెన్స్, హరీష్ శంకర్ టేకింగ్, థమన్ మ్యూజిక్, రాంప్రసాద్ ఫొటోగ్రఫీ ఈ చిత్రానికి హైలైట్స్ అవుతాయి. ‘మిరపకాయ్’ టైటిల్ కి తగినట్టుగానే రవితేజ క్యారెక్టర్ వుంటుంది. సాంగ్స్ అన్నీ సూపర్ హిట్ అవుతాయి. బ్యాంకాక్ లో చేసిన క్లైమాక్స్ చాలా థ్రిల్లింగ్ గా వుటుంది. డిసెంబర్ 5న ఈ చిత్రం ఆడియోను ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ చేస్తాం. డిసెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే అంశాలతో రూపొందిన ‘మిరపకాయ్’ ఈ సంవత్సరం సూపర్ హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుంది’ అన్నారు.

దర్శకులు హరీష్ శంకర్ మాట్లాడుతూ- ‘రవితేజ నుండి ఏ తరహా చిత్రాన్ని ప్రేక్షకులు, అభిమానులు ఆశిస్తున్నారో ఆ అంచనాలకు ధీటుగా ‘మిరపకాయ్’ వుంటుంది. రవితేజ నటన హైలైట్ గా మిరపకాయ్ ప్రేక్షకుల అపూర్వ ఆదరణను అందుకుంటుంది’ అన్నారు.

రవితేజ, రిచా గంగోపాధ్యాయ, దీక్ష, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, సునీల్, చంద్రమోహన్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, అజయ్, అలీ, నాగబాబు, రాజారవీందర్, బ్రహ్మాజీ, రావు రమేష్, సుప్రీత్, సుధ, సురేఖవాణి నటిస్తున్న ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రీఫీ : సి.రామ్ ప్రసాద్, సంగీతం: ఎస్.థమన్, పాటలు : సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్, భాస్కరభట్ల, అనంత శ్రీరామ్, సాహితి, స్క్రీన్ ప్లే : రమేష్ రెడ్డి, విక్రమ్ సిరి, దీపక్ రాజ్, డాన్స్ : రాజుసుందరం, బృంద, గణేష్ స్వామి, రఘు, ఫైట్స్ : రామ్ లక్షణ్, ఎడిటింగ్ : గౌతంరాజు, ఆర్ట్ : బ్రహ్మ, కడలి, అసోసియేట్ డైరెక్టర్స్ : నాగేంద్ర వుద్దీశ, సత్యనారాయణ బండి గుప్తాపు, విజయ్ కనకమేడల, కో-డైరెక్టర్స్ : బుజ్జి (ఎ.వి.రత్నం), కొర్రపాటి కిరణ్ కుమార్, ప్రొడక్షన్ కంట్రోలర్ : దేవినేని బ్రహ్మానందరావు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : రాజా రవీందర్, నిర్మాత రమేష్ పుప్పాల, కథ-మాటలు-దర్శకత్వం : హరీష్ శంకర్ ఎస్.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com