ఫిలిం న్యూస్
 
 
 
 
'మిరపకాయ్' సక్సెస్‌మీట్‌
రవితేజ కథానాయకుడిగా, హరీష్‌శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన 'మిరపకాయ్' సక్సెస్‌మీట్‌ తాజ్‌దక్కన్‌ హోటల్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్‌ అంతా హాజరైంది. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ...'ఈ విజయం చాలా ఆనందాన్ని ఇచ్చింది. దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు. సాంకేతిక నిపుణులందరికీ ధన్యవాదాలు. స్నిగ్ధ వాయిస్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది' అని అన్నారు.

నటుడు సునిల్‌ మాట్లాడుతూ...'సినిమా చూసి ఒక అభిమానిగా చాలా ఆనందపడ్డాను. రొటీన్‌ కమర్షియల్‌ సినిమా అని క్రిటిక్స్‌ వచ్చాయి. రవితేజ ప్రయోగాత్మక చిత్రాలూ చేశారు. అయితే అవి ఆశించినంత ఆడలేదు. అయితే ముందు ముందు మరిన్ని మంచి సినిమాలు వస్తాయి' అని అన్నారు.

ఆలీ మాట్లాడుతూ...'బ్యానర్‌లో వచ్చిన మొదటి సినిమానే హిట్‌ అయింది. భవిష్యత్‌ కూడా ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా. హీరోహీరోయిన్లు చాలా బాగా చేశారు. ఘాటుగా తీశారు.' అని అన్నారు.

దర్శకుడు హరీష్‌శంకర్‌ మాట్లాడుతూ...'షాక్‌' పరాజయం తర్వాత టెన్షన్‌ పడ్డాను. కానీ రవితేజ ధైర్యాన్నిచ్చారు. ఈ సినిమా టైటిల్‌ పెట్టింది రవితేజ. ఓ ప్లాప్‌ సినిమా తీసినా, మరో చిత్రాన్ని చేయాలనుకోవటం ఇండస్టీలో ఆషామాషీ విషయం కాదు. సాంకేతిక నిపుణులంతా చాలా కష్టపడి పనిచేశారు. అనుకున్న బడ్జెట్‌ కన్నా, సమయాని కన్నా తక్కువలో పని పూర్తిచేశాం. ఈ క్రెడిట్‌ యూనిట్‌ అంతటికీ దక్కుతుంది' అని తెలిపారు.