ఫిలిం న్యూస్
 
 
 
 
రాజశేఖర్ 'మోనార్క్'

సాయి రాఘవేంద్ర ఫిలిమ్స్ పతాకంపై అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా మోనార్క్ చిత్రం హైదరాబాద్ లో ప్రారంభమయింది. డి.శీనయ్య, మురళి శ్రీనివాస్ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిరిస్తున్నారు. అలాగే రాజశేఖర్ పుట్టిన రోజు వేడుకను అభిమానుల సమక్షంలో జరుపుకుననారు. ఈ చిత్రం యొక్క షెడ్యూల్ ను మరియు చిత్ర విశేషాలను వెల్లడించడానికి పాత్రికుయుల సమావేశం ఏర్పాటు చేశారు.

డా. రాజశేఖర్ మాట్లాడుతూ - నా బర్త్ డే కానుకగా అమ్మ రాజశేఖర్, మురళి మరియు శీనయ్యలు ఈ చిత్రాన్ని అందిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీకి వచ్చి 26 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ రోజు నేను ఈ స్థానంలో ఉన్నానంటే అఖిలాంధ్ర ప్రేక్షకుల ఆదరాభిమానాలే కారణం. ఇక ఈ సినిమా విషయానికొస్తే అమ్మ రాజశేఖర్ 5 సంవత్సరాలు కష్టపడి ఈ కథను తయారు చేశాడు. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్ టైన్ మెంట్ మరియు హీరోయిజం చూపించే కథ. ఈ కథ నాకు బాగా నచ్చింది. మోనార్క్ నాకు పెద్ద హిట్ గా సిలుస్తుంది అన్నారు.

మహంకాళి సినిమా మొత్తం పూర్తయింది. ఇంకో వారంలో విడుదలకు సిద్ధమవుతుంది అని తెలిపారు.

అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ - మోనార్క్ కొత్త స్టైల్ లో తీయబోతున్నాము. ఫుల్ అండ్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్. రాజశేఖర్ ఈ సినిమాలో కామెడిని పండించబోతున్నారు. రాజశేఖర్ గారికి ఈ సినిమా పెద్ద హిట్ నిస్తుంది అన్నారు.

శీనయ్య మాట్లాడుతూ - బయ్యర్ గా ఎగ్జిబ్యూటర్ గా నాకు చాలా అనుభవం ఉంది. అమ్మ రాజశేఖర్ చెప్పిన కథ ఆకట్టుకుంది. ఈ సినిమా రాజశేఖర్ కెరియర్ లో రికార్డులను సృష్టిస్తుంది అన్నారు. మార్చి మొదటివారం నుండి షెడ్యూల్ ప్రారంభిస్తాము అని అన్నారు.

జీవిత మాట్లాడుతూ - రాజశేఖర్ గారు సినీ పరిశ్రమకు వచ్చి 26 సంవత్సరాలు పూర్తయింది. ప్రేక్షకులదరికి ఆయనంటే అమితమైన అభిమానం. ఆ అభిమానం ఎల్లప్పుడు అలాగే ఉండాలని కోరుకుంటున్నాను.

నటీనటుల మరియు సాంకేతిక నిపుణులు - రాజశేఖర్ నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు - మరుధూరి రాజా, సంగీతం : మణిశర్మ, ఎడిటింగ్ : గౌతం రాజు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కాదంబరి కిరణ్, ప్రొడ్యూసర్స్ : డి.శీనయ్య, మురళి శ్రీనివాస్ ఎస్.ఆర్., కథ -స్క్రీన్ ప్లే- దర్శకత్వం : అమ్మ రాజశేఖర్.