జేడి చక్రవర్తి దర్శకత్వంలో చక్రవర్తి ప్రొడక్షన్స్, ఫస్ట్ ఛాయిస్ మీడియా హౌస్ పతాకంపై రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో కె. సత్యనారాయణ నిర్మిస్తున్న చిత్రం ‘మనీ మనీ మోర్ మనీ’. ఈ చిత్రం గురించి శనివారం జేడీ మాట్లాడుతూ - ‘‘‘మనీ’ నిర్మాత సుబ్బరాజుగారు తగిన ప్రోత్సాహాన్ని అందించారు. అలాగే ధరణి ఈ సినిమా బాగా చేశాడు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ రెండో వారంలో విడుదల
చేయాలనుకుంటున్నాం’’ అన్నారు.
‘‘ఈ చిత్రంలో 30కి పైగా హాస్య నటీనటులు నటించారు. ప్రేక్షకులకు ఈ సినిమా ఓ కన్నులపండగ’’ అని బ్రహ్మానందం అన్నారు. ఈ సినిమా ద్వారా నిర్మాతగా మారడానికి కారణం జేడి చక్రవర్తి అని, అడగ్గానే ఈ సినిమా చేయడానికి బ్రహ్మానందంగారు ఒప్పుకున్నారని నిర్మాత
సత్యనారాయణ చెప్పారు.
ఈ సినిమాతో అసోసియేట్ కావడం ఆనందంగా ఉందని రిలయన్స్ ప్రతినిధి సంజయ్ అన్నారు. ఇంకా ఈ సమావేశంలో సుబ్బరాజు, బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు. జేడి, బ్రహ్మానందం, కవిన్‌దేవ్, సుబ్బరాజు, నాగబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: చక్రి, మాటలు: మరుధూరి రాజా, కెమెరా: భరణి కె. ధరన్, పాటలు: రామజోగయ్యశాస్త్రి, సహనిర్మాత: ఎస్.పి. తోట, నిర్మాత: కె.సత్యనారాయణ,
కథ,స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: జె.డి. చక్రవర్తి.