Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
యశో సాగర్‌ ‘Mr. ప్రేమికుడు’
     'ఉల్లాసంగా ఉత్సాహంగా' చిత్రం ద్వారా హీరోగా పరిచయమై నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న యశో సాగర్‌ హీరోగా రూపొందుతున్న మలి చిత్రం 'కట. ప్రేమికుడు' హైదరాబాద్‌లో ఆరంభమైంది. అమృత్‌ అమరనాథ్‌ ఆర్ట్స్‌ పతాకంపై ఎన్‌.మనో అభినవ్‌ (నాయుడు)ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని బీపీ సోము నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రీకరించిన తొలి దృశ్యానికి దర్శకుడు తులసీ రాం కెమెరా స్విచాన్‌ చేయగా డా. డి.రామానాయుడు క్లాప్‌ ఇచ్చారు. తొలి సన్నివేశానికి దర్శకుడు సుకుమార్‌ గౌరవం దర్శకత్వం వహించారు.

యశో సాగర్‌ మాట్లాడుతూ -"ఉల్లాసంగా ఉత్సాహంగా తర్వాత ఏడాదిన్నర గ్యాప్‌ తీసుకుని ఈ సినిమా చేస్తున్నాను. మంచి సినిమా చేయాలనే ఉద్దేశంతోనే ఈ గ్యాప్‌ తీసుకున్నాను. అద్భుతమైన కథ కుదిరింది' అన్నారు. "ఈ లవ్‌స్టోరీ చాలా ట్రిక్కీగా ఉంటుంది. తెలుగులో విజయం సాధించిన ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ కన్నడంలో రీమేక్‌ అయ్యి ఘనవిజయం సాధించింది. రెండు విజయాలు అందించిన బేనర్‌ ఇది. ప్రేమలో పడే హీరో ఆ ప్రేమను గెలిపించుకోవడానికి ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడనే ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం.

మంచి కథ, అద్భుతమైన స్క్రీన్‌ప్లే కుదిరింది' అని రచయితలు రమేష్‌-గోపి తెలిపారు. నటి జయమాల కుమార్తె సౌందర్య శ్రేయాస్‌ ఈ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయం అవుతున్నారు. సౌందర్య మాట్లాడుతూ -"కథానాయికగా నాకిది తొలి చిత్రం. ఉల్లాసంగా ఉత్సాహంగా చిత్రాన్ని దాదాపు 15సార్లు చూసి ఉంటాను. యశోకి అభిమాని అయ్యాను' అన్నారు. "ఇదొక అద్భుతమైన ప్రేమకథ. జూన్‌ నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ఆరంభిస్తాం' అని దర్శకుడు చెప్పారు. పలు కన్నడ చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించిన నేను తెలుగులో చేస్తున్న తొలి చిత్రం ఇది' అని కృష్ణ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: రమేష్‌-గోపి, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, లైన్‌ ప్రొడ్యూసర్స్‌: వినయ్‌, జ్యోతిర్మయి, కో-ప్రొడ్యూసర్‌: కార్తీక్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: పి.రామమోహనరావు, నిర్మాత: బి.పి.సోము, కథ- స్క్రీన్‌ప్లే- డైరెక్షన్‌: ఎన్‌.మనో అభినవ్‌.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com