ఫిలిం న్యూస్
 
 
 
 
నాగ చైతన్య -దేవ్ కట్టా లతో కే . అచ్చిరెడ్డి చిత్రం
నాగచైతన్య హీరోగా దేవకట్టా దర్శకత్వంలో రూపొందే సినిమా జూన్‌లో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఆర్‌.ఆర్‌.మూవీమేకర్స్‌ సమర్పణలో మాక్స్‌ ఇండియా ప్రొడక్షన్స్‌ పతాకంపై కె.అచ్చిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నాగచైతన్య మాట్లాడుతూ -‘దేవాకట్టా చెప్పిన కథ చాలా ఇన్‌స్పిరేషన్‌గా ఉంది. హీరో పాత్రచిత్రణ అద్భుతం. నాకు మంచి సినిమా అవుతుంది’ అన్నారు.

ఆర్‌.ఆర్‌.మూవీమేకర్స్‌ వెంకట్‌ మాట్లాడుతూ -‘ఈ క్రేజీ కాంబినేషన్‌లో సినిమాని ఏమాత్రం రాజీలేకుండా నిర్మిస్తున్నాం’ అన్నారు.

మాక్స్‌ ఇండియా అధినేత కె.అచ్చిరెడ్డి మాట్లాడుతూ - ‘అద్భుతమైన సబ్జెక్ట్‌ ఇది. మంచి పాయింటుతో వాణిజ్యపరమైన అంశాలను మేళవించి స్టైలిష్‌ సినిమాగా రూపొందిస్తాం. విభిన్న ఛాయల్లో హీరో పాత్రచిత్రణ ఉంటుంది. నాగచైతన్యను హైరేంజ్‌కి తీసుకెళుతుంది. త్వరలో ఇతర వివరాలందిస్తాం’ అన్నారు.

‘వెన్నెల’, ‘ప్రస్థానం’తర్వాత దేవకట్టాకి 3వ చిత్రమిది. ఆది ‘ప్రేమకావాలి’ తర్వాత కె.అచ్చిరెడ్డి మాక్స్‌ ఇండియా ప్రొడక్షన్స్‌లో నిర్మిస్తున్న 2వ సినిమా కూడా ఇదే. జూన్‌లో ప్రారంభం కానున్న ఈ చిత్రానికి కథ-కథనం-దర్శకత్వం: దేవా కట్టా.