నాగార్జున హీరోగా కామాక్షి కళా మూవీస్ పతాకంపై కిరణ్ దర్శకత్వంలో అగ్ర నిర్మాత డి.శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.12 చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్ర విశేషాలను నిర్మాత డి.శివప్రసాద్ రెడ్డి తెలియజేస్తూ- ‘కామాక్షి బ్యానర్ 1984లో ప్రారంభించగా1985లో తొలి చిత్రం ‘శ్రావణసంధ్య’ రిలీజ్ అయింది. 2010లో అంటే కామాక్షి బ్యానర్ సిల్వర్ జూబ్లీ ఇయర్ కానుకగా నాగార్జున చిత్రాన్ని జనవరి రెండో వారంలో సంక్రాంతి సందర్భంగా విడుదల చేస్తున్నాం. గతంలో మా బ్యానర్లో వచ్చిన ‘శ్రావణసంధ్య’, ‘ముఠామేస్ర్తి’ చిత్రాలు సంక్రాంతికి విడుదలై ఘన విజయాన్ని సాధించాయి. ఇప్పుడు చేస్తున్న సినిమా పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్. అయితే స్ర్కీన్ ప్లే డిఫరెంట్గావుంటూసినిమా కొత్త స్టయిల్లో వుంటుంది. చాలా లావిష్ గా, స్టయిలిష్ గా తీస్తున్న ఈ చిత్రం తప్పకుండా అన్నివర్గాల ప్రేక్షకుల్ని బాగా ఎంటర్ టైన్ చేస్తుంది’ అన్నారు కామాక్షి కళా మూవీస్ అధినేత, అగ్రనిర్మాత డి.శివప్రసాద్ రెడ్డి. ‘దాదాపు 80రోజుల పాటు షూట్ చేశాం. ఇంకా 20రోజుల వర్క్ వుంది. ప్రస్తుతం నాగార్జునతో ‘డాన్’ విలన్ కెల్లీడార్జ్ పాల్గొన్న ఫైట్ ను సారథి స్టూడియోలో సెట్ వేసి తీస్తున్నాం. అలాగే గ్రీస్ లో నాగార్జున, మమతామోహన్ దాస్ లపై ఓ పాట, నాగార్జున, మోడల్స్ పై ఓ పాట తీస్తాం. హైదరాబాద్లో క్లైమాక్స్ ప్లాన్ చేశాం. చివరో్ల నాగార్జునతో ఓ ఐటెం గర్ల్ పాల్గొనే సెట్ సాంగ్ తీయడంతో షూటింగ్ పూర్తవుతుంది’ అన్నారు.
‘నాగార్జున కొత్త స్టయిల్లో కనిపిస్తారు. యాక్షన్, ఎంటర్ టైన్మెంట్ ప్రధానంగా వుండే సినిమా ఇది. నాగార్జునకి ఇది మరో మంచి కమర్షియల్ సినిమా అవుతుంది. మమతా మోహన్ దాస్ హీరోయిన్ గా నటిస్తోంది. అమెరికా అమ్మాయి లిండా ఓ ముఖ్యపాత్రను పోషిస్తోంది. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ ఫేం అంకుర్ విలన్గా చేస్తున్నారు. అలాగే ‘బాండిట్ క్వీన్’ ఫేం నిర్మల్ పాండే, లాగన్ ఫేం అఖిలేంద్ర మిశ్రా, ‘డాన్’ విలన్ కెల్లీడార్జ్ పాత్రలు హైలైట్ అవుతాయి. ఇంకా షయ్యాజీ షిండే, బ్రహ్మానందం, హర్షవర్థన్, తనికెళ్ళ భరణి ముఖ్యపాత్రలు పోషించారు.కామాక్షిబ్యానర్లో మరో కలర్ ఫుల్ కాస్ట్ లీ కమర్షియల్ ఫిలిం ఇది. త్వరలోనే టైటిల్ నిర్ణయిసా్తం’ అన్నారు.
అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో కామాక్షి కళామూవీస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : సందీప్ చౌతా, ఫొటోగ్రఫీ : సర్వేష్ మురారి, ఫైట్స్ : సెల్వ, ఎడిటింగ్ : శ్రవణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : అక్కినేని వెంకటరత్నం, నిర్మాత : డి.శివప్రసాద్ ెడ్డి, కథ-స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: కిరణ్.
జనవరిలో నాగచైతన్య హీరోగా భారీ చిత్రం:
‘కింగ్’ నాగార్జున హీరోగా కామాక్షి కళామూవీస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరిలో విడుదలవుతుండగా, జనవరిలోనే యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా అగ్రనిర్మాత డి.శివప్రసాద్ రెడ్డి ఓ భారీ చిత్రాన్నిప్రారంభిస్తున్నారు. ఈ చిత్రం కోసం అద్భుతమైన సబ్జెక్ట్ రెడీ అయిందని చెప్పారు.