నాగార్జున హీరోగా అగ్రనిర్మాత డి.శివప్రసాద్ రెడ్డి శ్రీ కామాక్షి ఎంటర్ ప్రైజెస్ పతాకంపై ‘బిందాస్’ ఫేం వీరు పోట్ల దర్శకత్వంలో
నిర్మిస్తున్న భారీ చిత్రం నిర్మాణం శరవేగంగా జరుగుతోంది.
నాగార్జున మాట్లాడుతూ - ‘‘హలో బ్రదర్ లా మంచి ఎంటర్ టైన్ మెంట్, యాక్షన్ మిక్స్ అయి వుంటుంది. రాయలసీమ బ్యాక్
డ్రాప్ లో సాగే ఈ కథ ఫ్యాక్షన్ సినిమా మాత్రం కాదు. ఈ సినిమాలో నేను ఫస్ట్ టైమ్ రాయలసీమ స్లాంగ్ లో మాట్లాడుతున్నాను. ఇది
మంచి యాక్షన్ ఎంటర్ టైనర్. దర్శకుడు వీరు పోట్ల ఇంతకుముందు చేసిన ‘బిందాస్’ చూశాను. అందులో ఎంటర్ టైన్ మెంట్ ని
బాగా పండించాడు. ఈ స్ర్కీప్ట్ లో కూడా నాన్ స్టాప్ గా ఎంటర్ టైన్ మెంట్ వుంది. వీరుతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా వుంది.
అనుష్క, ప్రియమణి లతోపాటు మరో నాయిక కూడా ఈ చిత్ర కథలో వుంటుంది.శివప్రసాద్ రెడ్డిగారి బేనర్ అంటే నా ఓన్ బేనర్ లా ఫీల్
అవుతాను. అనవాయితీ ప్రకారం డిసెంబర్ లో రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు.
నిర్మాత డి.శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ - ‘‘నాకు మంచి మిత్రుడు నాగార్జునగారు. నిర్మాతగా నేను, హీరోగా నాగార్జునగారు
సిల్వర్ జూబ్లీ ఇయర్ లోకి ఎంటర్ అయిన నేపథ్యంలో కామాక్షి బ్యానర్ పై చేస్తున్న సినిమా ఇది.’’ అన్నారు.
దర్శకుడు వీరు పోట్ల మాట్లాడుతూ - ‘‘ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ తో 30% పూర్తయింది. ఇది మంచి మాస్ ఫిలిం.
అయితే క్లాస్ ఆడియన్స్ లో నాగార్జునగారికి వున్న ఇమేజ్ ని దృష్టిలో వుంచుకుని ఓ స్టైలిష్ మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందిస్తున్నాం.
మంచి ఎంటర్ టైన్ మెంట్, యాక్షన్, సెంటిమెంట్, రొమాన్స్ అన్నీ వున్న సినిమా ఇది. నాగార్జునగారికి ఇది డిఫరెంట్ ఫిలిం
అవుతుంది. డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. దర్శకుడుగా నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్న మా హీరో
నాగార్జునగారికి జన్మదిన శుభాకాంక్షలు’’ అన్నారు.
నాగార్జున, అనుష్క, ప్రియమణి, ప్రదీప్ రావత్. దేవ్ గిల్, కోటశ్రీనివాసరావు, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం,
మాస్టర్ భారత్, సన,రఘుబాబు, సుప్రీత్, గిరిధర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : తమన్ ఎస్, ఫోటోగ్రఫి :
సర్వేష్ మురారి, ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్, స్టిల్స్ : రఘు, కాస్ట్యూమ్స్ : ఫిరోజ్, మేకప్ : బొమ్మదేవర రామచంద్రరావు,
ఎడిటింగ్ : మార్తాండ్ కె.వెంకటేష్, ఫైట్స్ : విజయ్, డాన్స్ : రాజు-సుందరం, కో-డైరెక్టర్ : శ్రీను, ప్రొక్షన్ కంట్రోలర్ :
యుగంధర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : బుచ్చిరాజు, నిర్వహణ : చెంచురెడ్డి, నిర్మాత : డి.శివప్రసాద్ రెడ్డి, కథ - స్ర్కీన్
ప్లే - దర్శకత్వం : వీరు పోట్ల.