Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
సంక్రాంతికి 'నమో వెంకటేశ'‌
     వెంకటేష్‌, త్రిష జంటగా సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రై.లిమిటెడ్‌ మరియు 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకరలు నిర్మిస్తున్న ‘నమో వెంకటేశ’ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో వెంకటేష్‌ మాట్లాడుతూ ‘‘ఇంతకు ముందు కొన్ని సినిమాల్లో నేను కామెడీ చేసాను. కాని ఈ సినిమాలో చేసిన కామెడీ అద్భుతంగా పండింది. ఇందులో వినోదంతో పాటు శృంగారం, యాక్షన్‌, సెంటిమెంట్‌ అన్నీ వున్నాయి. ఇందులో బ్రహ్మానందం పాత్ర హైలైట్‌ అవుతుంది. సంక్రాంతికి అందరికీ నచ్చే సినిమా అవుతుంది’’ అన్నారు.

దర్శకుడు శ్రీను వైట్ల మాట్లాడుతూ ‘‘నాకు ఎంతో ఇష్టమైన వెంకటేష్‌తో ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా వుంది. సంక్రాంతికి అందరికీ ఇష్టమైన విందు భోజనం లాంటి సినిమా ఇది. ఈ సినిమా విజయం మా యూనిట్‌ అందరికీ మంచి బహుమతి అవుతుంది’’ అన్నా రు. నిర్మాతలు రాము, గోపి, అనిల్‌ మాట్లాడుతూ ‘‘వెంకటేష్‌- శ్రీను వైట్ల కాంబినేషన్‌ అనగానే అంచనాలు భారీ ఎత్తున వుంటా యి. ఆ అంచనాలకు తగ్గ విధం గానే సినిమా వుంటుంది. సంక్రాంతి కానుకగా ‘నమో వెంకటేశ’ విడుదల చేస్తున్నాం’’ అన్నారు.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com