Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
వెంకటేష్ ‘నమో వెంకటేశ’‌
     సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ వెంకటేష్ - త్రిష జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘నమో వెంకటేశ’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్లో శ్రీనువైట్ల మాట్లాడుతూ- వెంకటేష్ కాంబినేషన్లో నేను ఈ చిత్రం చేయడానికి సురేష్ బాబు కారణం. వెంకటేష్ తో చేయడం నాకు చాలా సంతోషదాయకంగా వుంది. త్రిష ఇందులో ప్రాధాన్యత వున్న పాత్ర పోషించింది. బ్రహ్మానందం కామెడీ కూడా ప్రత్యేకతను సంతరించుకుంది. ఇప్పటికి 85శాతం పూర్తయిన ఈ చిత్రం అన్ని విధాలా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకంతో వున్నానని అన్నారు.

వెంకటేష్ మాట్లాడుతూ- ఎప్పటి నుండో శ్రీనుతో చేయాలనుకుంటున్నాను. ‘నువ్వు నాకు నచ్చావు’, ‘జయంమనదేరా’ తరహాలో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉంటుంది. నా పాత్ర క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది. ఇందులో నేను ఒక్కడినే హీరో కాదు. బ్రహ్మానందం, నేను ఇందులో హీరోలుగా చేశాం. ‘ఆడవాళ్ళ మాటలకు అర్థాలే వేరులే’ తర్వాత త్రిషతో ఈ చిత్రం చేస్తున్నాను. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉంటాయి అన్నారు.

సురేష్ బాబు మాట్లాడుతూ- చందమామ కథలాంటి ప్రేమ, కుటుంబ కథాంశంతో చేస్తున్న ఈ చిత్రం అన్ని వర్గాల వారినీ ఆకట్టుకుంటుంది. ఇంతమంది ఆర్టిస్టులను కలిపి షూటింగ్ చేయడం చాలా కష్టమైన విషయం. ఈ విషయంలో ఆర్టిస్టులు మాకు చాలా సహకరించారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నామని అన్నారు. బ్రహ్మానందం మాట్లాడుతూ- ప్యారిస్ ప్రసాద్ గా ఈ చిత్రం పెద్ద పాత్రను పోషించాను. నా పాత్ర ఆసక్తికరంగా వుంటుంది అని అన్నారు. మంచి టీమ్ తో, ఫ్యామిలీ కథాంశంతో నిర్మించిన ఈ చిత్రంలో చేయడం సంతోషంగా వుంది- అని త్రిష చెప్పింది. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : దేవిశ్రీప్రసాద్, ఫొటోగ్రఫీ : మూరెళ్ళ అందిస్తున్నారు.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com