Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
నిత్య, నానిల ‘‘అలా మొదలైంది’’
     నాని కథానాయకుడిగా శ్రీరంజిత్‌ మూవీస్‌ సంస్థ నిర్మిస్తున్న చిత్రం 'అలా మొదలైంది'. నిత్యమీనన్‌ నాయిక. స్నేహవుల్లాల్‌, కృతి కర్బందా కీలక పాత్రధారులు. కె.ఎల్‌.దామోదర్‌ప్రసాద్‌ నిర్మాత. ఈ చిత్రం ద్వారా బి.వి.నందినిరెడ్డి దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. చిత్రీకరణ తుది దశకు చేరింది. దర్శకురాలు మాట్లాడుతూ ''ప్రేమ అన్నది రెండక్షరాల పదమే అయినా దానికున్న శక్తి అపారమైనది. ఆ మధుర భావనను సొంతం చేసుకొనేందుకు పరుగు ప్రారంభించిన ఓ యువ జంట కథే మా చిత్రం. ఆ పరుగులో వాళ్లకి ఎన్నో అవరోధాలు. వాటిని దాటుకొంటూ ప్రేమను ఎలా సఫలం చేసుకున్నారన్నదే కథ. దీన్ని తెరపై చూపించిన విధానం కొత్తగా ఉంటుంది. నిర్మాత దామోదర్‌ప్రసాద్‌ తండ్రి కానూరి రంజిత్‌కుమార్‌ గతంలో ఎన్నో మంచి చిత్రాలు నిర్మించారు. 'మా ఇద్దరి కథ', 'చీకటివెలుగులు', 'చట్టానికి వేయికళ్లు' లాంటి చిత్రాల్ని అందించిన సంస్థ రంజిత్‌ మూవీస్‌. ఆ సంస్థ ద్వారా దర్శకురాలిని కావడం ఆనందంగా ఉంద''న్నారు. నిర్మాత మాట్లాడుతూ ''కొంత విరామం తరవాత మా నుంచి వస్తున్న చిత్రమిది. వినోద ప్రధానంగా ఉంటుందీ సినిమా'' అన్నారు. ఆశిష్‌ విద్యార్థి, చైతన్య, ప్రగతి, రోహిణి, శివన్నారాయణ, సి.వి.ఎల్‌.నరసింహారావు ఇతర పాత్రధారులు. మాటలు: లక్ష్మీభూపాల్‌, సంగీతం: కల్యాణిమాలిక్‌, పాటలు: అనంతశ్రీరామ్‌, లక్ష్మీభూపాల్‌, రెహమాన్‌, కూర్పు: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, ఛాయాగ్రహణం: అర్జున్‌ జీవా, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: వివేకానంద కూచిభొట్ల.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com