'శివపుత్రుడు, అపరిచితుడు, మల్లన్న'... ఇలా వైవిధ్య భరితమైన చిత్రాల్లో నటించి, విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విక్రమ్ హీరోగా
రూపొందిన తాజా తమిళ చిత్రం 'దైవ తిరుమగళ్'. సాధారణంగా తమిళంలో ఓ భారీ చిత్రం రూపొందుతోందంటే.. అందులోనూ విక్రమ్‌లాంటి 'సేలబుల్
హీరో' నటించిన చిత్రం అంటే.. ఆ చిత్రంపై తెలుగు నిర్మాతల దృష్టి ఉంటుంది. ఆ చిత్రం అనువాద హక్కులు పొందడానికి భారీ ఎత్తున పోటీపడతారు.
అనువాద హక్కులకు భారీ పోటీ ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే... ఇటీవలి కాలంలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న చిత్రం శంకర్,
రజనీకాంత్‌ల 'రోబో'. ఈ చిత్రంపై భారీ ఎత్తున పోటీ నెలకొనడంతో హక్కులు 28 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. తాజాగా విక్రమ్ నటించిన
'దైవ తిరుమగళ్' హక్కులకు కూడా కోట్లలోనే కోట్ చేశారు ఈ చిత్రనిర్మాత ఎం.చింతామణి. తెలుగు రంగానికి చెందిన పలువురు ప్రముఖ నిర్మాతలు
హక్కులు సంపాదించుకోవడం కోసం పోటీ పడినందువల్ల 'దేవతిరుమగళ్'కిి భారీ ఎత్తున క్రేజ్ పెరిగింది. చివరికి ఓ ఫ్యాన్సీ రేట్ ఇచ్చి ఈ చిత్రం
హక్కులను వెల్ఫేర్ క్రియేషన్స్ అధినేత డా|| మళ్ల విజయప్రసాద్, సంతోషం స్టూడియోస్ ప్రై. లిమిటెడ్ అధినేత సురేష్ కొండేటి సంయుక్తంగా
చేజిక్కించుకున్నారు. ఈ చిత్రం 'నాన్న' పేరిట తెలుగులో విడుదల కానుంది. ఇక తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న మళ్ల విజయప్రసాద్,
సురేష్ కొండేటిల గురించి చెప్పాలంటే...విజయాల ప్రసాద్ ఎం.ఎల్.ఎగా మంచి గుర్తింపుని సొంతం చేసుకుని, వెల్ఫేర్ క్రియేషన్స్‌పై తొలి ప్రయత్నంగా
'సిద్ధు ఫ్రం శీకాకుళం'లాంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించారు డా|| మళ్ల విజయప్రసాద్. అనంతరం 'సీతారాముల కళ్యాణం లంకలో' చిత్రాన్ని
నిర్మించారు. ఇక ఇటీవల 'అల్లరి' నరేష్‌తో మళ్ల విజయప్రసాద్ నిర్మించిన 'సీమటపాకారు' ఏ రేంజ్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆ రకంగా మళ్ల విజయప్రసాద్ 'విజయాల ప్రసాద్' అనిపించుకున్నారు. ఉత్తమాభిరుచిగల సురేష్ ఇక సురేష్ కొండేటి గురించి చెప్పాలంటే...
పంపిణీదారుడుగా పలు విజయవంతమైన చిత్రాలను అందించి తొలి ప్రయత్నంగా తమిళంలో ఘనవిజయం సాధించిన 'కాదల్' చిత్రాన్ని 'ప్రేమిస్తే'గా
అనువదించి తెలుగులో విడుదల చేశారు. ఆ చిత్రంతో ఉత్తమాభిరుచిగల నిర్మాతగా సురేష్ మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు. మలి చిత్రంగా
సంతోషం స్టూడియోస్ ప్రై. లిమిటెడ్‌పై ఆయన విడుదల చేసిన 'షాపింగ్ మాల్' కూడా ఘనవిజయం సాధించి, సురేష్‌కి సక్సెస్‌ఫుల్ నిర్మాతగా పేరు
తెచ్చింది.
ఇలా విజయవంతమైన చిత్రాలను అందిస్తూ తమది గోల్డెన్ హ్యాండ్ అని నిరూపించుకుంటున్న మళ్ల విజయప్రసాద్, సురేష్ కొండేటి తొలి
కాంబినేషన్‌లో విడుదలవుతున్న 'నాన్న' ఘనవిజయం సాధించడం ఖాయం అని నిస్సందేహంగా చెప్పొచ్చు. పక్కా కమర్షియల్ సినిమా ఎల్.
విజయ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. విజయ్ దర్శకత్వం వహించిన 'కిరీడం, పొరు సొల్ల పోరోమ్'.. ఈ రెండు తమిళ చిత్రాలూ సూపర్ డూపర్
హిట్ అయ్యాయి. ఆ రకంగా విజయ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూడవ చిత్రంపై తమిళనాడులో భారీ అంచనాలు ఉన్నాయి. సహజత్వానికి
దగ్గరగా ఉన్న కథతో రూపొందించిన ఈ చిత్రంలో కమర్షియల్ అంశాలు మెండుగా ఉన్నాయి. కరెక్ట్‌గా చెప్పాలంటే ఒక సక్సెస్‌ఫుల్ సినిమాకి
కావల్సిన అన్ని అంశాలు ఉన్న ఈ చిత్రం కమర్షియల్‌గా భారీ విజయాన్ని సాధించడం ఖాయం అని చెప్పొచ్చు.
ఈ చిత్రంలో విక్రమ్ సరసన అనుష్క, అమలా పాల్ నాయికలుగా నటించారు. ఈ ఇద్దరివీ నటనకు అవకాశం ఉన్న పాత్రలే. 'అరుంధతి' ద్వారా
తనలో ఎంత మంచి నటి ఉందో అనుష్క రూపించుకుంది. అలాగే 'మైనా'లో తన నటన ద్వారా అమలా పాల్ తమిళ ప్రేక్షకుల హృదయాలను
కొల్లగొట్టింది. ఈ చిత్రానికి ఈ ఇద్దరూ ప్లస్. ఇక చిత్రానికి ఉన్న మరిన్ని ప్లస్ పాయింట్స్‌లో జి.వి. ప్రకాష్‌కుమార్ అందించిన సంగీతం ఒకటైతే.. శశాంక్
వెన్నెలకంటి అందించిన మాటలు మరొకటి. ఇటీవల సురేష్ కొండేటి విడుదల చేసిన 'షాపింగ్ మాల్'లో ఉన్న రెండు సూపర్ హిట్ సాంగ్స్ 'కలలను
కలిపే..', 'నా ప్రాణం'కి ట్యూన్స్ ఇచ్చింది జి.వి. ప్రకాష్‌కుమారే. ఇక శశాంక్ వెన్నెలకంటి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్ట్రయిట్ చిత్రాలను తలపించే
విధంగా అనువాద చిత్రాలకు ఆయన డైలాగులు అందిస్తారు. ఇలా 'నాన్న' గురించి ఏ అంశం గురించి చెప్పుకున్నా ప్లస్ పాయింట్స్ కనిపిస్తాయి.
నూటికి తొంభైతొమ్మిది శాతం హృదయాలను హత్తుకునే కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం
ఖాయం. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
|