ఫిలిం న్యూస్
 
 
 
 
కార్తీ 'నా పేరు శివ' సక్సెస్ మీట్

కార్తి కథానాయకుడిగా తమిళ్ లో సుశీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ‘నాన్ మగాన్ అల్లా’ సినిమాను తెలుగులోకి ‘నా పేరు శివ’ పేరున అనువదించి విడుదల చేశారు స్టూడియో గ్రీన్ వారు. ఈ సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్స్ జరిగింది.

ఈ కార్యక్రమంలో కార్తి, కె.ఇ.జ్ఞానవేల్ రాజా, ప్రసన్న కుమార్, మధుర శ్రీధర్, రాము, ప్రభు, బి.వి.యస్.యన్, ప్రసాద్ లు పాల్గొన్నారు.

ప్రసన్న కుమార్ మాట్లాడుతూ - ఎంత సక్సెస్ వస్తే అంతగా ఒదిగి ఉండే వ్యక్తి జ్ఞానవేల్ రాజు. ఆయన వరుసగా హిట్స్ కొడుతున్నారు. అలాగే కార్తి తెలుగును ఎక్కువగా ఇష్టం అని చెప్పే హీరో. అతనికిది హ్యాట్రిక్ చిత్రం. అతను స్ట్రెయిట్ సినిమాలు కూడా చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.

మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ - కార్తి తెలుగులో మంచి ఫాలోయిగ్ సాంపాదించుకున్నాడు. తన మూడు సినిమాలతో. అందువల్లనే మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ సినిమా సెకండ్ పొజీషన్ లో ఉంది ఆడియో పరంగా. సినిమాకు పని చేసిన వారందరికీ కృతజ్ఞతలు.

జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ - సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు థాంక్స్. ముఖ్యంగా బి.ఏ.రాజుగారు నీతో కలిసి ప్రయాణిస్తున్నారు. ఆయనకు కూడా నా థాంక్స్ చెపుతున్నాను. సినిమాను చాలా చక్కగా అనువదించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ నా ధన్యవాదాలు అన్నారు.

కార్తి మాట్లాడుతూ - ఈ సినిమా నా పెళ్ళి గిఫ్ట్ లాంటిది. ఈ విజయానికి కారణం హార్డ్ వర్క్. ఈ సినిమా తరువాత తెలుగులోకి వస్తావు అని చెప్పారు. త్వరలో రెండు భాషల్లో సినిమా చేయనున్నాను. నా నిజ జీవితంలో కేరక్టర్ లాగా ఈ సినిమాలో నా కేరక్టర్ ఉంటుంది. ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు. మీ అందరికీ థాంక్స్ చెప్పడానికి షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని వచ్చాను.

ప్రభు మాట్లాడుతూ - ఈ చిత్ర సుశీంద్రన్ సినిమాను చాలా చక్కగా తీశాడు. ఈ సినిమాను తెలుగులో ఆదరిస్తున్న ప్రేక్షకులకు నా ధన్యవాదాలు అన్నారు.