Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
ఇవివి ‘కత్తి కాంతారావు’గా నరేష్
     బిగ్ బి ప్రొడక్షన్స్ పతాకంపై ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘కత్తి కాంతారావు’ ప్రారంభమైంది. నరేష్, అలీపై చిత్రీకరించిన తొలిషాట్ కు మాగంటి బాబు క్లాప్ ఇవ్వగా, పాతూరి రామారావు కెమేరా స్విచ్ఛాన్చేశారు.తొలి షాట్ కు రామానాయుడు దర్శకత్వం వహించారు.

ఇవివి మాట్లాడుతూ- ‘ఇందులో తెలివైన కానిస్టేబులుగా నరేష్ నటిస్తున్నాడు. ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో వుండే కథలో నరేష్ డిఫరెంట్ గా కనిపిస్తాడు. నలుగురు అక్కచెల్లెళ్ళు, తల్లిదండ్రులు, డిపార్టుమెంటులోని సమస్యలను పరిష్కరించే ‘కత్తి కాంతారావు’గా నరేష్ పాత్ర వుంటుంది. మల్లిఖార్జున్ అనే కొత్త మ్యూజిక్ డైరెక్టర్ని పరిచయం చేస్తున్నాం. హైదరాబాద్, రాజమండ్రి, ఏలూరులో ఈ చిత్రం షూటింగ్, సెప్టెంబర్లో ఇందులోని 4 పాటలను చిత్రీకరించి, అక్టోబర్లో విడుదల చేస్తామ’ని చెప్పారు.

నరేష్ మాట్లాడుతూ - కథ కన్నా సినిమా పేరు మీద ఎక్కువ కష్టపడ్డాం. ఇందులో నా ఇంటి పేరు కత్తి, నా పేరు కాంతారావు. ‘బెండప్పారావు’ హీరోయిన్ కామ్నజత్మలానీ ఇందులో హీరోయిన్. ఆ చిత్రం కన్నా ఇది మరింత మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ - ‘బెండప్పారావు’ కాంబినేషన్ లో ఇవివితో మేం నిర్మిస్తున్న రెండవ చిత్రం ఇది. ఫ్యామిలీ, కామెడీ కలసిన కథలో సందేశం కూడా ఉంటుంది. దసరాకి విడుదల చేయాలనుకుంటున్నాం అని అన్నారు. ఈ చిత్రానికి కథ - మాటలు : ప్రసాద్ వర్మ, పాటలు : రామజోగయ్య శాస్త్రి, ఫోటోగ్రఫీ : ఎ.విజయకుమార్, ఎడిటింగ్ : గౌతంరాజు, నిర్మాతలు : ఈదర శ్రీనివాస్, ఈడ్పుగంటి పూర్ణ చంద్రరావు, ఈడ్పుగంటి సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఈదర రవికుమార్.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com