'ఎ'టీవీ సమర్పణలో ‘బిందాస్’ లాంటి విజయవంతమైన చిత్రాన్ని
నిర్మించిన ఎ.కె.ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో అల్లరి నరేష్ హీరోగా, సుకంర
రామబ్రహ్మం నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.2. ఈ చిత్రం ద్వారా వీరభద్రమ్
దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇవివి, తేజ, కృష్ణవంశీ
లాంటి ప్రముఖ దర్శకుల వద్ద వీరభద్రమ్ పనిచేశారు. ఇవివి దగ్గర
‘నేను ప్రేమిస్తున్నారు’, ‘కన్యాదానాం’, ‘చాలా బాగుంది’
చిత్రాలకు, తేజ వద్ద ‘నువ్వు నేను’, ‘జయం’, ‘నిజం’
చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేశారు.
కృష్ణవంశీతో ‘డేంజర్’, జయంత్ తో ‘శంకర్ దాదా ఎంబిబిఎస్’,
కరుణాకరన్ తో ‘హ్యాపీ’ చిత్రాలకు కోడైరెక్టర్ గా పనిచేశారు. ఇప్పుడు
ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న
ప్రొడక్షన్ నెం.2 చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హీరో అల్లరి
నరేష్, మరో కీలక పాత్రలో శ్రీహరి, ఇతర ముఖ్యపాత్రల్లో ఆహుతి
ప్రసాద్, నాగినీడు, బ్రహ్మానందం,ఎంఎస్ నారాయణ, ధర్మవరం,
శ్రావణ్, అరవింద్, రజిత నటిస్తున్నారు. రఘు కుంచె సంగీతం,
లోక్ నాథ్ ఛాయాగ్రహణం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గరికపాటి కిషోర్,
ప్రొడ్యూసర్ సుంకర రామబ్రహ్మం, కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం :
వీరభద్రమ్. ఆగస్ట్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం
రొమాంటిక్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అని దర్శకులు వీరభద్రమ్ తెలిపారు.
|