ఫిలిం న్యూస్
 
 
 
 
సెప్టెంబర్ 9న 'నేను నాన్న అబద్దం'

నందు, దివ్య హీరో హీరోయిన్లుగా కృష్ణుడు ప్రధాన పాత్రలో గోవింద్‌ వరహా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'నేను నాన్న అబద్ధం'. కె.అనంతలక్ష్మి సమర్పణలో కాస్మిక్‌ పిక్చర్స్‌ పతాకంపై బాలప్రకాష్‌ నిర్మించిన ఈ చిత్రం చిత్రీకరణతో పాటు నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుని సెప్టెంబర్‌ 9న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

దర్శకుడు గోవింద్‌ వరహా మాట్లాడుతూ... 'నిర్మాతలు నాకు ఇచ్చిన సదవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకున్నాను. చిత్రం చాలా బాగా వచ్చింది. ఇటీవల విడుదలైన ట్రైలర్స్‌కు, ఆడియోకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. ఖచ్చితంగా ఈ చిత్రం కూడా మీ అందర్నీ అలరిస్తుందని' అన్నారు.

నిర్మాత బాలప్రకాష్‌ మాట్లాడుతూ... 'మంచి సందేశంతో కూడుకున్న ఈ ప్రేమకథా చిత్రం చాలా అందంగా తెరకెక్కింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో భాగంగా డి.టి.యస్‌ జరుపుకుంటున్న మా సినిమాని సెప్టెంబర్‌ 9న విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నాము' అన్నారు.

నటుడు ప్రకాష్‌ భరద్వాజ్‌ మాట్లాడుతూ... 'నేను కూడా ఇందులో భాగస్వామిని. ఈ చిత్రం అందంగా, సహజంగా, హాయిగా వుంటుంది. ఎన్ని ప్రేమకథలు వచ్చినా కొన్నిటికే ప్రేక్షకుల మదిలో సుస్ధిర స్ధానాన్ని సంపాదించుకుంటాయి. ఆ కొన్నిటిలో మా చిత్రం కూడా వుండాలని నిశ్చయంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాము. రష్‌ చాలా అద్భుతంగా వుంది. చిన్నిచరణ్‌ ఫెంటాస్టిక్‌ మ్యూజిక్‌నిచ్చాడు' అన్నారు.