‘మృగం’ వంటి విజయవంతమైన చిత్రాన్ని అందించిన స్వామి దర్శకత్వంలో రాబోతున్న మరో చిత్రం ‘నేటి చరిత్ర’ (హిస్టరీ రిపీట్). ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ సెప్టెంబర్1న జరగనుంది.ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
చిత్ర నిర్మాత జె.ఫణీంద్రకుమార్ ‘నేటి చరిత్ర’ ప్రోగ్రెస్ గురించి మాట్లాడుతూ- ‘షూటింగ్ పూర్తయి, ప్రస్తుతం ప్రసాద్ ల్యాబ్లో డబ్బింగ్ జరుగుతోంది. ఇక దీనికి సంబంధించిన ఆడియో ఆవిష్కరణను కూడా ప్రసాద్ ల్యాబ్ థియేటర్లోనే సెప్టెంబర్ 1న జరపనున్నామని తెలిపారు. ‘నేటి చరిత్ర’ మొదటి కాపీ సెప్టెంబర్ మొదటివారంలోగా సిద్ధమవుతుంది. సెన్సార్ కార్యక్రమాన్ని పూర్తి చేసి సెప్టెంబర్లో చిత్రాన్ని విడుదల చేస్తాము. దర్శకుడు స్వామి ఈ చిత్రాన్ని ఎవ్వరూ ఇంతవరకు టచ్ చేయనటువంటి పాయింట్ తో మలిచారు. ప్రతిఒక్కరినీ ఆకట్టుకునే రీతిలో పతాక దృశ్యాల్ని తీర్చిదిద్దారు. మగవారిని, మహిళలనే కాకుండా మాస్ ప్రేక్షకులను కూడా అలరిస్తుందని’ అన్నారు.
హరీష్ కళ్యాణ్, అనక జంటగా నటించిన ఈ చిత్రంలో గజిని, గంజకరువ్పు తదితరులు ఇతర ప్రధాన పాత్రల్ని పోషించారు. పొందూరి సంభాషణలు సమకూర్చుతున్న ఈ చిత్రానికి పాటలు : పొందూరి, భారతీబాబు, సంగీతం : శంబో శివశంభో ఫేం సుందర్ సి.బాబు, ఛాయాగ్రహణం: ఉత్పల్ వి నాయర్, కళ : తోట తరణి, ఎడిటింగ్ : జి.శశికుమార్, నృత్యాలు : దిన, ఫైట్స్: రాజశేఖర్, సమర్పణ: ఎస్.మైఖేల్ రాయప్పన్, నిర్మాత : జె.ఫణీంద్రకుమార్, కథ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం : స్వామి.