ఫిలిం న్యూస్
 
 
 
 
17న విడుదల 'నిప్పు'

రవితేజ, దీక్షాసేథ్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న 'నిప్పు' చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటుంది. ఫిబ్రవరి 17న మహాశివరాత్రి కానుకగా విడుదల కానుంది.

ఈ సందర్భంగా నిర్మాత వై.వి.యస్‌.చౌదరి మాట్లాడుతూ, ''ఇటీవల అన్నపూర్ణ స్టూడియోలో వేసిన భారీ సెట్‌లో చిత్రీకరించిన పాటతో టోటల్‌గా షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. ఫిబ్రవరి 17న మహాశివరాత్రి కానుకగా ఈ చిత్రాన్ని వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం. ఇటీవల ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా విడుదలైన ఈ చిత్రం ఆడియో సూపర్‌ డూపర్‌హిట్‌ అయింది. థమన్‌ చాలా ఎక్స్‌లెంట్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. అన్ని ఏరియాల్లో ఆడియో సేల్స్‌ బాగుందని రిపోర్ట్స్‌ వస్తున్నాయి. మా బొమ్మరిల్లు బేనర్‌లో వచ్చిన సినిమాలన్నీ ఆడియో పరంగా చాలా పెద్ద హిట్‌ అయ్యాయి. దానికి మించిన రేంజ్‌లో 'నిప్పు' ఆడియోకి రెస్పాన్స్‌ వస్తోంది. రవితేజ, గుణశేఖర్‌ ఫస్ట్‌ కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రం ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చింది. తప్పకుండా ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుందన్న నమ్మకం నాకు వుంది'' అన్నారు.