మాస్ మహారాజా రవితేజ హీరోగా డైనమిక్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో డేరింగ్ ప్రొడ్యూసర్ వైవియస్ చౌదరి బొమ్మరిల్లువారి పతాకంపై నిర్మిస్తున్న భారీ చిత్రం 'నిప్పు' సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్దమవుతోంది. సంక్రాంతికి రిలీజైన రవితేజ చిత్రాలు 'కృష్ణ', 'మిరపకాయ్' సూపర్‌హిట్ అయిన నేపధ్యంలో ఈ సంక్రాంతి స్పెషల్ 'నిప్పు' పై చాలా మంచి ఎక్స్‌పెక్టేషన్స్ వున్నాయి.
ఈ చిత్రం గురించి నిర్మాత వైవియస్ చౌదరి మాట్లాడూతూ - ''శరవేగంగా రూపొందుతున్న 'నిప్పు' చిత్రం రవితేజ మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు గుణశేఖర్‌గారి టేకింగ్ స్టైల్ తోడై సూపర్‌గా వస్తోంది. ఈ 'నిప్పు'చిత్రంలో నటకిరీటి డా|| రాజేంద్రప్రసాద్‌గారు ఓ కీలకమైన పాత్రను పోషించడం విశేషం. కమెడియన్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు ఎంటర్‌టైన్‌మెంట్ అందించే ట్రెండ్‌ని బ్రేక్ చేసి కామెడికే హీరోయిజాన్ని తెచ్చి వరుసగా ఎన్నో సూపర్ డూపర్‌హిట్స్ ఇచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ హీరో రాజేంద్రప్రసాద్‌గారు. ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగువాళ్ళు ఆయన చిత్రాల డివిడిలను ప్రత్యేకంగా దాచుకుంటారు. అంతటి పేరు ప్రతిష్ఠలు సంపాదించుకున్న రాజేంద్రప్రసాద్‌గారు హుందాగా, తన ఇమేజ్‌కి భంగం కలగకుండా తాను మాత్రమే చెయ్యగలరనిపించే వైవిధ్యమైన పాత్రల్ని చెయ్యాలన్న నిర్ణయం తీసుకోవడం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కొత్త పరిణామం. దర్శకులు, కథా రచయితలు ఇది ఎంతో ఆనంద పడుతున్న విషయం. మా చిత్రంలో ఓ కీలకమైన పాత్రను పోషించమని నేను, గుణశేఖర్‌గారు అడిగిన వెంటనే ఈ పాత్ర ఔన్నత్యాన్ని తెలుసుకొని ఎంతో బిజీగా వున్నప్పటికీ ఆయనే స్వయంగా కాల్‌షీట్స్ ఎడ్జస్ట్ చేసి మా చిత్రంలో నటిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 'ఆ నలుగురు'లో ఆయన పోషించిన పాత్రలా ఎంతో హుందాగా ఈ పాత్ర అద్భుతంగా గుణశేఖర్‌గారి దర్శకత్వంలో రూపొందుతోంది. 'నిప్పు' చిత్రానికి రాజేంద్రప్రసాద్‌గారి పాత్ర ఓ హైలైట్ అవుతుంది. ముందే మేము చెప్పిన విధంగా సంక్రాంతి కానుకగా 'నిప్పు' విడుదల చేస్తాము. హీరో రవితేజ పాత్ర ఇందులో నిప్పులా వుంటుంది. అందుకే ఈ చిత్రానికి మేము 'నిప్పు' అనే పేరుని పెట్టడం జరిగింది. సేమ్‌టైమ్ రవితేజ స్టైల్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్, గుణశేఖర్‌గారి చిత్రాల్లో వుండే కథాబలం, టెక్నికల్ వేల్యూస్ అన్నీ కలిసి వుంటాయి'' అన్నారు.
మాస్ మహారాజా రవితేజ సరసన పొడుగుకాళ్ళ సుందరి దీక్షాసేథ్ కథానాయిగా నటిస్తున్న ఈ చిత్రంలో డా|| రాజేంద్రప్రసాద్, ప్రదీప్ రావత్, బ్రహ్మానందం, కృష్ణుడు, ధóర్మవరపు సుబ్రహ్మణ్యం, ముకుల్ దేవ్, బ్రహ్మాజీ, సుప్రీత్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: థమన్, సినిమాటోగ్రఫీ: సర్వేష్ మురారి, ఆర్ట్: ఆనంద్‌సాయి, ఎడిటింగ్: గౌతంరాజు, ఫైట్స్: కనల్‌కణ్ణన్, డాన్స్: రాజు సుందరం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.ఆర్.కిషోర్, కో-ప్రొడ్యూసర్స్: యలమంచిలి యుక్త, యలమంచిలి ఏక్తా, సమర్పణ: యలమంచిలి గీత, నిర్మాత: వై.వి.యస్.చౌదరి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: గుణశేఖర్.